సిగ్గులేని రాజకీయాలు.. ప్రకాష్‌ రాజ్‌ ఫైర్‌

Prakash raj Lashes Out Ananthkumar Hegde - Sakshi

సాక్షి, చెన్నై : విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్‌ మరోసారి రాజకీయాలపై ట్విట్టర్‌లో స్పందించారు. ఈసారి బీజేపీ నేత,  కేంద్ర మంత్రి అనంతకుమార్‌ హెగ్డేపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. హిందుత్వం-జాతీయత ఒక్కటేనని హెగ్డే ఈ మధ్య వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాష్‌ రాజ్‌ వాటిని ఖండిస్తూ ట్విట్టర్‌లో వరుస ట్వీట్లు చేశారు.

నేషనలిజం, హిందుత్వం ఒక్కటేనని చెబుతున్న మంత్రిగారు ఆమాటకు అర్థం కూడా వివరిస్తే బాగుంటుందని తొలుత ప్రకాశ్‌ రాజ్‌ మొదట ఓ ట్వీట్‌ చేశారు. ఇస్లాం మతాన్ని ప్రపంచంలోనే లేకుండా చేయాలని ఈయనగారు భావిస్తున్నారేమోనంటూ అనంతకుమార్‌ మాట్లాడిన వీడియోను పోస్టు చేశారు. ఆపైనే అసలు విమర్శలతో ఓ పోస్టును ప్రకాశ్‌ ఉంచారు.

‘‘ ఆ రెండూ ఒకటేనని అంటున్నప్పుడు అసలు మతం విషయాన్ని లేవనెత్తటం ఎందుకు? అంబేద్కర్‌, అబ్దుల్‌ కలాం, రెహమాన్‌, కుష్వంత్‌ సింగ్‌, అమృత ప్రీతమ్‌, డాక్టర్‌ కురియన్‌ వీరంతా ఎవరు?. నాలాగా మతాన్ని కాకుండా మానవత్వాన్ని నమ్మేవారి పరిస్థితి ఏంటి? మేం ఈ దేశానికి చెందిన వాళ్లం కాదా? అసలు మీ ఏజెండా ఏంటి? పునర్జన్మను బలంగా నమ్మే మీరంతా నియంత హిట్లర్‌కు ప్రతీకలా? సెక్యులర్‌ దేశం మనందరిది. ఈ సిగ్గులేని రాజకీయాలతో మీకు ఒరిగేది ఏంటి? అంటూ ప్రకాష్‌ రాజ్‌ అనంతకుమార్‌పై మండిపడ్డారు. 

కాగా, 52 ఏళ్ల ప్రకాష్‌ రాజ్‌ ఇంతకు ముందు గౌరీ లంకేష్‌ హత్య విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి కూడా చురకలు అంటించిన విషయం తెలిసిందే. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top