పార్లమెంటులో ఆసక్తికర సన్నివేశం

PM Narendra Modi Shake Hands With Vijayasai Reddy - Sakshi

న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పార్లమెంటు లైబ్రరీ భవనంలో జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత, ఎంపీ విజయసాయిరెడ్డి కనిపించడంతో ప్రధాని నరేంద్రమోదీ ఒక్కసారిగా ఆగి.. ఆయనను పలుకరించారు. ‘విజయ్‌ గారూ..’ అంటూ సంబోధించి ఆయనతో మోదీ కరచాలనం చేశారు. 

ఇక, జమిలి ఎన్నికలతోపాటు పలుకీలక అంశాలపై జరిగిన ఈ అఖిలపక్ష సమావేశంలో సుమారు నాలుగు గంటలపాటు కొనసాగింది. జమిలి ఎన్నికలపై ఓ కమిటీ వేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ఇది ప్రభుత్వ ఎజెండా కాదు, యావత్‌ దేశ ఎజెండా అని, ఈ అఖిలపక్ష భేటీకి 40 పార్టీలను ఆహ్వానించగా.. 24 పార్టీలు పాల్గొన్నాయని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top