ఓటడిగేందుకు రాలేదు: పవన్‌ | Pawan Kalyan comments at anantapur kadiri | Sakshi
Sakshi News home page

ఓటడిగేందుకు రాలేదు: పవన్‌

Jan 29 2018 1:34 AM | Updated on Mar 22 2019 5:33 PM

Pawan Kalyan comments at anantapur kadiri - Sakshi

కదిరి/అనంతపురం/నల్లమాడ: ‘జనసేన పార్టీకి ఓట్లు వేయమని అడిగేందుకు నేను రాలేదు. ఇక్కడి పరిస్థితులు అ«ధ్యయనం చేసేందుకు వచ్చాను. అనంతపురం జిల్లా బాగా వెనుకబడింది. ఈ జిల్లాలో నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను ప్రధాని నరేంద్ర మోదీకి ఓ నివేదిక రూపంలో సమర్పిస్తాను. ప్రజలు కూడా నాయకులను నిలదీసేందుకు సిద్ధంగా ఉండాలి. ఆఖరుకు నన్ను కూడా నిలదీయండి’ అని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు.

ఆదివారం ఆయన అనంతపురం జిల్లా కదిరి, పుట్టపర్తి నియోజక వర్గాల్లో పర్యటించారు. కదిరిలో రోడ్‌షో అనంతరం స్థానిక హోటల్‌లో మహిళలతో ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరామ్‌తో భేటీ అయ్యా రు. జిల్లాలో కరువు పరిస్థితులపై అధ్యయనం చేయడంలో భాగంగా ఎవరితోనైనా కలుస్తానని ఇందులో భాగంగానే మంత్రిని కలిశానని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలా? వద్దా? అనేది ప్రజల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటామని మంత్రి సునీత స్వగృహంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు పవన్‌ సమాధానమిచ్చారు.నల్లమాడలో జరిగిన తోపులాటలో మహేశ్‌ అనే యువకుడికి గాయాలయ్యాయి. 

Advertisement
 
Advertisement
Advertisement