దౌర్జన్యం ఓడింది. ధర్మం గెలిచింది : పార్థసారథి

Parthasarathy on Jaggayyapet Municipal Chairman Election Victory - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అధికారం అండతో టీడీపీ దౌర్జన్యం చేయాలని యత్నించినా చివరకు ధర్మమమే గెలిచిందని వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత పార్థసారథి తెలిపారు. జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్‌ ఎన్నిక విజయంపై వైఎస్సాఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా తో మాట్లాడారు. 

ముఖ్యనేతలు, కార్యకర్తలు ఇలా అంతా వచ్చి భయానక వాతావరణం సృష్టించినా ప్రభుత్వం పాచికలు పారలేదని పార్థసారథి తెలిపారు. చివరకు అధికారులపై దాడికి కూడా ప్యూహరచన చేశారని.. మానసిక ఒత్తిడి తీసుకొచ్చేందుకు యత్నించారని ఆయన అన్నారు. ఎన్నికల అధికారి ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే ఎంపీ నేతృత్వంలో దాడి చేసేందుకు పోడియం చుట్టు చేరారని ఆయన అన్నారు. వారి దౌర్జన్యకాండ మొత్తం మీడియాలో ప్రజలంతా చూశారని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి చర్యలతో పనులు చేయించుకోవటమే పనా అని చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. దమ్ముంటే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

టీడీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారంటూ వైఎస్సార్‌సీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు, చైర్మన్ అభ్యర్థి మీద అక్రమ కేసులు బనాయించారని.. బెదిరింపులకు కూడా పాల్పడ్డారన్నారు. చివరకు శాంతి భద్రతల సమస్యలు సృష్టించి ఎలాగైనా సరే ఎన్నికలు ఆపేందుకు తీవ్రంగా యత్నించారని, ఒకవేళ అనుకూలంగా వ్యవహరించి ఉంటే మాత్రం ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళిక రచించారని చెప్పారు. ఎన్ని కుట్రలు పన్నినా చివరకు ధర్మమే గెలిచిందని తెలిపారు. వచ్చే రోజుల్లో కూడా పార్టీ కార్యకర్తలు.. ప్రజా ప్రతినిధులు ఒకేతాటిపైకి వచ్చి పోరాడతామని..  ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం వైఎస్సార్‌ సీపీ కట్టుబడి ఉందని పార్థసారథి స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top