ఎన్నికల్లో ప్రజా సంఘాల భాగస్వామ్యం

Padmanabha reddy on Assembly election management  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో ప్రజా ఎన్నికల నిఘా వేదికతో సమన్వయం చేసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్‌కుమార్‌ హామీనిచ్చినట్లు సుపరిపాలన వేదిక అధ్యక్షుడు పద్మనాభరెడ్డి తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో 20 స్వచ్ఛంద సంస్థల కలయికతో ఎన్నికల నిఘా వేదిక ఏర్పా టు చేశామన్నారు. ఎన్నికల్లో అక్రమాలు, ఓటర్ల కు ప్రలోభాలను నిర్మూలించడం ద్వారా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిం చేందుకు వేదిక తరఫున కృషి చేస్తామన్నారు.

సీఈఓతో సోమవారం సచివాలయంలో సమావేశమై ఈ మేరకు సహకారం కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ఓటరు జాబితాలో పేర్ల చేర్పు, ఓటర్లను చైతన్యపరచడంతో పాటు ఎన్నికల అక్రమాలపై నిరంతర నిఘా పెట్టేందుకు వేదిక ద్వారా ఎన్నికల యం త్రాంగానికి సహకరిస్తామన్నారు. నవంబర్‌ 1న సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చే ఎన్నికల నిఘా కార్యకర్తల శిక్షణ సమావేశానికి హాజరు కావడానికి సీఈఓ అంగీకరించినట్లు తెలిపారు. సమావేశంలో లోక్‌సత్తా ఉభయ తెలుగు రాష్ట్రాల కన్వీనర్‌ బండా రు రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top