
సాక్షి, హైదరాబాద్: ‘బీజేపీ అనే ఓ పార్టీ ఏడున్నదో ఎవరికీ తెలియదు..’అని సీఎం కేసీఆర్ మాట్లాడటం ఆయన అహంకారానికి పరాకాష్ట అని బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ విరుచుకుపడ్డారు. బీజేపీ ఎక్కడా లేకపోతే ఢిల్లీకి పోయి బీజేపీ నాయకులకు పొర్లుదండాలు ఎందుకు పెడుతున్నావని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఇంటి అద్దె హామీ విషయంలో ఎవరికి కడతారు? ఏం కడతారని ఆయనకు అర్థం కాక విమర్శిస్తున్నారని, అది ప్రజలకు అర్థమైందని అన్నారు. 50 గదుల విశాలమైన ప్రగతి భవన్‌లో ఉండే ఆయనకు పేదల బాధ ఏం తెలుస్తుందని విమర్శించారు. తాము అ«ధికారంలోకి వస్తే రాజకీయ అవినీతిని నిర్మూలిస్తామని, దాంతో అలాంటి పథకాలు మరో పది అమలు చేయవచ్చని పేర్కొన్నారు.