అంబానీ మద్దతుపై దుమారం

Mukesh Ambani backs Congress Milind Deora for South Mumbai - Sakshi

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ దక్షిణ ముంబై నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి మిలింద్‌ డియోరాకు బాహాటంగా మద్దతు ప్రకటించడం రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. అంబానీ మద్దతు ప్రకటిస్తున్న వీడియోను డియోరా తన ట్విట్టర్‌ హ్యాండిల్‌లో పెట్టారు. ‘పదేళ్లుగా దక్షిణ ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న మిలింద్‌కు ఈ నియోజకవర్గానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉందని నా విశ్వాసం. అందుకే ఈ నియోజకవర్గానికి మిలిందే తగిన వ్యక్తి’ అని అంబానీ అన్నట్టు ఆ వీడియోలో ఉంది. దేశంలోని బడా పారిశ్రామికవేత్తలెవరూ ఇంత వరకు ఒక పార్టీ అభ్యర్థికి బహిరంగంగా మద్దతు ప్రకటించడం జరగలేదు. అలాంటిది దేశంలోనే నంబర్‌వన్‌ పారిశ్రామికవేత్త అయిన అంబానీ ఒక అభ్యర్థికి, అదీ ప్రతిపక్ష పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం విశేషమేనని రాజకీయ నిపుణులు అంటున్నారు.

రెండోసారి అధికారంలోకి రావాలని మోదీ ప్రయత్నిస్తున్న తరుణంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రతిపక్ష అభ్యర్థికి మద్దతు ప్రకటించడం అధికార బీజేపీకి ఇబ్బందికరమేనని వారు అభిప్రాయపడుతున్నారు. ముకేశ్‌ ప్రకటనపై బీజేపీ నేతలు నొసలు చిట్లిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో విమర్శిస్తున్నారు. కాగా, అంబానీ, డియోరా చిరకాల మిత్రులని, అందువల్ల అంబానీ ప్రకటనను మరో కోణంలో చూడాల్సిన పనే లేదని పారిశ్రామిక వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అంబానీ తండ్రి ధీరూభాయ్, డియోరా తండ్రి మురళీ మంచి మిత్రులు. వారి స్నేహం గురించి అప్పట్లో రాజకీయ వర్గాల్లో వేడివేడి చర్చ కూడా జరిగేది. ముకేశ్‌ తాజా నిర్ణయానికి అది కూడా కారణం కావచ్చునని ఆ వర్గాలు వివరించాయి. ముకేశ్‌ ఉన్న వీడియోలో కోటక్‌ మహీంద్ర బ్యాంకు ఎండీ ఉదయ్‌ కొటక్‌ కూడా ఉండటం గమనార్హం. రఫేల్‌ కుంభకోణంలో ముకేశ్‌ సోదరుడు అనిల్‌ అంబానీ ఇరుక్కోవడం తెలిసిందే. దక్షిణ ముంబై నియోజకవర్గంలో ఈ నెల 29న పోలింగ్‌ జరగనుంది. ఇక్కడ డియోరా, శివసేన అభ్యర్థి అరవింద్‌ సావంత్‌తో తలపడుతున్నారు. 

మరిన్ని వార్తలు

26-05-2019
May 26, 2019, 02:31 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల అభివృద్ధే లక్ష్యంగా కలసి ముందుకు సాగాలని ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ...
25-05-2019
May 25, 2019, 21:38 IST
సాక్షి, చెన్నై : బీజేపీపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ మండిపడ్డారు. దేశానికి హిందీ రాష్ట్రాలే ముఖ్యం కాదని, దక్షిణాదికి...
25-05-2019
May 25, 2019, 18:48 IST
సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు అయింది. ఈ నెల 30వ...
25-05-2019
May 25, 2019, 17:47 IST
సాక్షి, గుంటూరు: రాజకీయాల్లో ఉద్దండుడిగా పేరుగాంచిన రాయపాటి సాంబశివరావు...వైఎస్సార్‌ సీపీ ఫ్యాను గాలికి కొట్టుకుపోయారు. జిల్లాలో సీనియర్‌ రాజకీయ నాయకుడిగా...
25-05-2019
May 25, 2019, 17:46 IST
ప్రమాణస్వీకారానికి రావాలని కేసీఆర్‌ను ఆహ్వానించిన
25-05-2019
May 25, 2019, 16:56 IST
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ను కలిశారు. 17వ లోక్‌సభకు ఎన్నికైన ఎంపీల...
25-05-2019
May 25, 2019, 16:53 IST
సభ్యుల విద్యార్హతలు ఎక్కువ. వయస్సు తక్కువ. మహిళల ప్రాతినిథ్యం ఎక్కువే..
25-05-2019
May 25, 2019, 16:47 IST
అమిత్‌ షా మొదటిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారంటే ఆశ్చర్యం కలుగుతుంది. గుజరాత్‌ వ్యాపారవేత్త కుమారుడైన..
25-05-2019
May 25, 2019, 16:41 IST
సాక్షి, హైదరాబాద్‌ :  రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం అయ్యారు. శనివారం మధ్యాహ్నం గన్నవరం నుంచి ప్రత్యేక...
25-05-2019
May 25, 2019, 16:02 IST
ఐదేళ్ల నారాసుర పాలనలో వైఎస్సార్‌సీపీ సైనికులు ఎన్నో ఇబ్బందులు
25-05-2019
May 25, 2019, 15:51 IST
సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో అఖండ మెజార్టీ సాధించిన అనంతరం తొలిసారి హైదరాబాద్‌ వస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...
25-05-2019
May 25, 2019, 15:17 IST
నందిగాం సురేశ్‌ను అలా చూస్తే కన్నీళ్లు ఆగలేదు
25-05-2019
May 25, 2019, 15:11 IST
సాక్షి, న్యూఢిల్లీ : 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. చత్తీస్‌గఢ్‌లో ఒక్క సీటును,...
25-05-2019
May 25, 2019, 14:56 IST
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు....
25-05-2019
May 25, 2019, 14:25 IST
16వ లోక్‌సభను రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ శనివారం రద్దు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో 303 స్థానాలు సొంతంగా గెలుచుకొన్న..
25-05-2019
May 25, 2019, 14:22 IST
పవన్ కళ్యాణ్‌పై జాలి వేసింది, ఒక్క చోటైనా గెలిస్తే బాగుండేదని రాజశేఖర్‌ అన్నారు.
25-05-2019
May 25, 2019, 14:18 IST
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ. 86 వేల కోట్ల నుంచి 2 లక్షల 14 వేల కోట్ల రూపాయలకు పైగా...
25-05-2019
May 25, 2019, 14:00 IST
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన షెడ్యూల్‌ విడుదల అయింది. ఆయన శనివారం...
25-05-2019
May 25, 2019, 13:36 IST
సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి,కాకినాడ: తూర్పున ఉదయించే సూర్యుడు లోకానికి వెలుగులు పంచడం ఎంత సహజమో.. ‘తూర్పు గోదావరి’ జిల్లాలో ఉదయించే...
25-05-2019
May 25, 2019, 13:33 IST
మాదీ పశ్చిమగోదావరే...మా నాన్న జిల్లాలో పనిచేశారు.మొగల్తూరు మా సొంతూరు అంటూ ఎన్నికల్లో పోటీచేసిన మెగా బ్రదర్స్‌కు డెల్టాప్రాంత ఓటర్లు పెద్ద...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top