‘తొలి పోరు’కు సిద్ధం.. 

MPTC And ZPTC Elections All Arrangements Is Completed - Sakshi

చుంచుపల్లి: తొలి విడత జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సోమవారం ప్రారంభం కానుంది. మొదటి విడతలో ఎన్నికలు జరగనున్న 71 ఎంపీటీసీలు, 7 జెడ్పీటీసీ స్థానాల నామినేషన్ల ప్రక్రియ 24వ తేదీన ముగుస్తుంది. నామినేషన్ల స్వీకరణకు జిల్లా అధికారులు ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా మండల పరిషత్‌ కార్యాలయాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ 
అభ్యర్థుల నుంచి ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు  స్వీకరిస్తారు. ఈ మూడు రోజుల పాటు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు ఆయా మండల కేంద్రాల్లో అందుబాటులో ఉంటారు. 25న నామినేషన్ల పరిశీలన, 26న అభ్యంతరాల స్వీకరణ, 27న వాటి పరిష్కారం ఉంటాయి.

నామినేషన్ల ఉపసంహరణకు 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంటుంది. నామినేషన్‌ దాఖలు సందర్భంగా జెడ్పీటీసీ స్థానం జనరల్‌ అయితే రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైతే రూ.2,500 డిపాజిట్‌ చెల్లించాలి. ఎంపీటీసీలకు జనరల్‌ అభ్యర్థులకు రూ.2,500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,250 చెల్లించాల్సి ఉంటుంది. మొదటి విడత ఎన్నికల కోసం 443 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3,190 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచారు. తొలి విడతలో అశ్వాపురం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు, పాల్వంచ, ములకలపల్లి, టేకులపల్లి మండలాల్లోని 71 ఎంపీటీసీ, 7 జెడ్పీటీసీ స్థానాలకు  మే 6న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుంది. బూర్గంపాడు మండలానికి చెందిన 11 ఎంపీటీసీ స్థానాలకు పదవీ కాలం మరో ఏడాది పాటు ఉన్నందున వాటికి ఎన్నికలు నిర్వహించరు. ఇక్కడ జెడ్పీటీసీ స్థానానికి మాత్రమే ఎన్నిక ఉంటుంది.

2,12,755 మంది ఓటర్లు...  
జిల్లాలోని అశ్వాపురం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు, పాల్వంచ, ములకలపల్లి, టేకులపల్లి మండలాల్లో ఎన్నికల ప్రక్రియకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొదటి విడతలో 7 మండలాల పరిధిలో 2,12,755 మంది ఓట్లు వేయనున్నారు. అశ్వాపురం మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాల పరిధిలో 31,022 మంది, చర్లలో 12 ఎంపీటీసీ స్థానాల పరిధిలో 30,625 మంది, దుమ్ముగూడెంలో 13 ఎంపీటీసీ స్థానాల పరిధిలో 32,707 మంది, బూర్గంపాడు జెడ్పీటీసీ పరిధిలో 28,632 మంది, టేకులపల్లిలోని 14 ఎంపీటీసీ స్థానాల పరిధిలో 37,548 మంది, పాల్వంచలోని 10 ఎంపీటీసీ స్థానాల పరిధిలో 26,323 మంది, ములకలపల్లిలోని 10 ఎంపీటీసీ స్థానాల పరిధిలో 25,898 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
  
తొలి విడత 7 మండలాల్లో రిజర్వేషన్లు ఇలా.. 

జిల్లా పరిధిలో 220 ఎంపీటీసీ, 21 జెడ్పీటీసీ స్థానాలుండగా వాటిలో బూర్గంపాడులోని 11 ఎంపీటీసీలకు ప్రస్తుతం ఎన్నికలు జరగవు. తొలి విడత ఎన్నికలు జరిగే 7 మండలాల ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారయ్యాయి. అశ్వాపురం ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను జనరల్‌ మహిళలకు కేటాయించారు. చర్ల ఎంపీపీ స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు, జెడ్పీటీసీ స్థానాన్ని ఎస్టీ మహిళకు రిజర్వ్‌ చేశారు. దుమ్ముగూడెం ఎంపీపీ స్థానాన్ని ఎస్టీ మహిళకు, జెడ్పీటీసీ స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. బూర్గంపాడులో కేవలం జడ్పీటీసీ ఎన్నిక మాత్రమే జరగనుండగా జనరల్‌ మహిళకు కేటాయించారు. పాల్వంచలో ఎంపీపీ స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు, జెడ్పీటీసీ స్థానాన్ని జనరల్‌కు రిజర్వు చేశారు. ములకలపల్లిలో ఎంపీపీ స్థానాన్ని ఎస్టీ మహిళకు, జెడ్పీటీసీ స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు ఖరారు చేశారు. టేకులపల్లిలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. ఇక బరిలో నిలబడే జెడ్పీటీసీ అభ్యర్థులు రూ.4 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థులు రూ.1.50 లక్షలు ప్రచారం నిమిత్తం ఖర్చు చేసేందుకు ఎన్నికల సంఘం పరిమితి విధించింది.

నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు  
జిల్లాలో మొదటి విడతలో ఎన్నికలు జరగనున్న 7 మండలాల్లోని 71 ఎంపీటీసీ, 7 జెడ్పీటీసీ స్థానాలకు సోమవారం నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్లు ఆయా మండల కేంద్రాలలోనే స్వీకరిస్తారు. నామినేషన్లు వేసే సమయంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. అభ్యర్థులు తమ నామినేషన్‌ పత్రాలలో పూర్తి విషయాలను పొందుపరచాలి.  – డి.పురుషోత్తం, డిప్యూటీ సీఈఓ, ఎన్నికల లైజన్‌ అధికారి 

మరిన్ని వార్తలు

20-05-2019
May 20, 2019, 04:10 IST
పట్నా: దేశంలో వేసవి ఎండల తీవ్రత మధ్య పోలింగ్‌ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగడంపై జేడీయూ చీఫ్, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌...
20-05-2019
May 20, 2019, 04:04 IST
న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి ఎన్నికల సంఘం(ఈసీ) లొంగిపోయిందని, ఈసీ అంటే ఇకపై ఎవరికీ భయం, గౌరవం ఉండవని కాంగ్రెస్‌ అధ్యక్షుడు...
20-05-2019
May 20, 2019, 04:04 IST
సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై వివిధ సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్‌ పోల్స్‌పై టీఆర్‌ఎస్‌లో సంతృప్తి వ్యక్తమవుతోంది. టీఆర్‌ఎస్‌ అనుకున్నట్లుగానే...
20-05-2019
May 20, 2019, 03:59 IST
బద్రీనాథ్‌/కేదార్‌నాథ్‌/న్యూఢిల్లీ: తన ఉత్తరాఖండ్‌ పర్యటనకు అనుమతి ఇచ్చిన ఎన్నికల సంఘానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ఉదయం...
20-05-2019
May 20, 2019, 03:49 IST
న్యూఢిల్లీ/సిమ్లా/వారణాసి: సార్వత్రిక ఎన్నికల చివరిదశ పోలింగ్‌ ఆదివారం హింసాత్మకంగా ముగిసింది. 7 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన 59...
19-05-2019
May 19, 2019, 22:02 IST
సాక్షి, హైదరాబాద్‌: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలినుంచి  ప్రజల పక్షాన చేస్తున్న పోరాటానికి ప్రజలు స్పష్టమైన తీర్పును ఇచ్చారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌...
19-05-2019
May 19, 2019, 21:22 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బీజేపీ క్లీన్‌స్వీప్‌ సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాయి. ఉత్కంఠ భరింతంగా సాగిన...
19-05-2019
May 19, 2019, 21:05 IST
బెంగాల్‌లో వికసించిన కమలం
19-05-2019
May 19, 2019, 20:56 IST
తమిళనాట డీఎంకే.. కర్నాటకలో బీజేపీ హవా
19-05-2019
May 19, 2019, 19:53 IST
సీట్లు తగ్గినా యూపీలో బీజేపీకే మొగ్గు
19-05-2019
May 19, 2019, 19:42 IST
వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని ఏపీలో అత్యధిక శాతం ప్రజలు కోరుకుంటున్నారు.
19-05-2019
May 19, 2019, 19:19 IST
చిత్తూరు : చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా చెదుముదురు ఘటనలు మినహా రీపోలింగ్‌ నిర్వహణ సక్రమంగానే జరిగింది....
19-05-2019
May 19, 2019, 18:41 IST
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
19-05-2019
May 19, 2019, 18:30 IST
సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధించడం ఖాయమని సెంటర్‌...
19-05-2019
19-05-2019
May 19, 2019, 18:16 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూసిన ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదలయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన...
19-05-2019
May 19, 2019, 17:03 IST
సీఎం కావాలన్నదే ఆయన కల..
19-05-2019
May 19, 2019, 16:57 IST
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఏడువిడతలుగా జరిగిన లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. లోక్‌సభ ఎన్నికలతోపాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల...
19-05-2019
May 19, 2019, 16:55 IST
సాక్షి, న్యూఢిల్లీ : భారత తొలి ఓటరు శ్యామ్‌ సరన్‌ నేగి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కల్పా...
19-05-2019
May 19, 2019, 16:45 IST
పట్నా: భోపాల్‌ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి ప్రజ్ఞా ఠాకూర్‌పై బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ తీవ్రంగా మండిపడ్డారు. జాతిపిత మహాత్మా గాంధీని...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top