చెదపురుగుల్లా తినేసి.. సుమతీ శతకాలా!

MP Vijay Sai reddy Satires On Chandrababu Naidu Over Janmabhoomi Committees - Sakshi

న్యూఢిల్లీ : తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠానికి కేంద్రీయ విద్యాలయం ప్రతిపత్తి కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభపక్ష నేత వీ విజయసాయిరెడ్డి కేంద్రానికి విఙ్ఞప్తి చేశారు. మంగళవారం రాజ్యసభలో చర్చ సందర్భంగా 60 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ విద్యాపీఠానికి సముచిత స్థానం కల్పించాలని కోరారు. అదే విధంగా భారతదేశ సందర్శనకు వస్తున్న మహిళా విదేశీ పర్యాటకుల భద్రత, రక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటో చెప్పాలని రాజ్యసభలో పర్యాటక శాఖ మంత్రిని ఆయన ప్రశ్నించారు.

ఏంటిది చంద్రబాబు గారు!?
తమ పాలనలో రాష్ట్రాన్ని దోచుకు తిన్నారంటూ టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక వైపు నిజాయితీగా పనిచేశామని బాజా కొట్టుకుంటుటూనే.. ఇంకో పక్క మాపై విచారణకు ఆదేశించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏ తప్పూ చేయని వారికి ఆందోళన ఎందుకు చంద్రబాబు గారూ? రాష్ట్రాన్ని చెదపురుగుల్లా తినేసి ఇప్పుడు సుమతీ శతకాలు వల్లిస్తే నమ్మేస్తారా? అంటూ ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అదే విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హయాంలో నిరుద్యోగ యువతను గ్రామ వలంటీర్లుగా నియమిస్తుంటే మీకు జన్మభూమి కమిటీలు గుర్తుకొస్తున్నాయా అని ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు. ప్రజలను పీడించుకు తిన్న జన్మభూమి కమిటీలకు, గ్రామ వలంటీర్ల వ్యవస్థకు తేడా ఏమిటో తొందర్లోనే తెలుస్తుందని.. అందాకా కాస్త ఓపిక పట్టాలని హితవు పలికారు. ఈమేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top