
లక్నో/పట్నా: ఉత్తరప్రదేశ్, బిహార్‌లలో ఆదివారం జరిగిన ఉప ఎన్నికల్లో ఒక మోస్తరు నుంచి అత్యల్ప ఓటింగ్ నమోదయింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, ఫూల్పూర్ లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలో వరుసగా 43 శాతం, 37.39 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. కాగా, బిహార్‌లోని అరారియా లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో 57 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే, భబువా, జహానాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 54.03, 50.06 శాతం పోలింగ్ నమోదైందని బిహార్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి అజయ్ వి.నాయక్ తెలిపారు. ఈ నెల 14వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.