‘లక్ష మంది కేసీఆర్‌లు వచ్చినా ఏమీ చేయలేరు’

MLA Sampath Kumar fires on cm k Chandra sekhar rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లక్షమంది కేసీఆర్‌లు కలిసినా ఉత్తముడైనా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఏమీ చేయలేరని ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ పేర్కొన్నారు. గాంధీభవన్‌ ఆవరణలో శనివారం ఆయన మాట్లాడుతూ..  ప్రజలకు అన్యాయం జరిగితే గొంతెత్తే పీసీసీ అధ్యక్షుడిపై అనాలోచితంగా మాట్లాడడం సీఎం మానుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియంత పోకడలకు పోతుందన్నారు.

ప్రభుత్వపై విమర్శలు చేస్తే సహించలేకపోతుందని, వారిపై కక్ష సాధిస్తోందని ఆయన విమర్శించారు. అమరుల కోసం జేఏసీ చైర్మన్‌ కోదండరాం యాత్ర చేపడితే ఆయన్ను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలను మానుకోవాలని ఎమ్మెల్యే హితవు పలికారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల కల్పనకు సంబంధించిన నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు.

రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పదోన్నతులు కల్పిస్తోందని ఆయన మండిపడ్డారు. ఒక్క దళిత ఉద్యోగికి అన్యాయం జరిగినా  సహించేది లేదని ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ హెచ్చరించారు. తెలంగాణ జిల్లాల్లో అమరవీరుల స్ఫూర్తి యాత్రకు బయలుదేరిన టీజేఏసీ ఛైర్మన్‌ కోదండరాంను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top