అపోహలు వద్దు.. త్వరలో తిరిగి వస్తా

MLA Candidate Chandramouli Massage to Kuppam People - Sakshi

శాంతిపురం : తన ఆరోగ్య పరిస్థితిపై అనవసరమైన అపోహలు, వదంతులను పట్టించుకోవద్దని వైఎస్సార్‌సీపీ కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రమౌళి ప్రజలు, పార్టీ శ్రేణులకు తెలిపారు. హైదరాబాదులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ మేరకు తెలుగు, తమిళ భాషల్లో రెండు వీడియోలను సోమవారం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. వీడియోలోని చంద్రమౌళి మాటలు యథాతధంగా..‘కుప్పం ప్రజలు,  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సోదర సోదరీమణులు, మిత్రులు అందరికీ నమస్కారాలు.

రెండు రోజుల క్రితం జగన్‌మోహనరెడ్డిగారు నన్ను పరామర్శించటానికి ఆస్పత్రికి వచ్చిన సమయంలో పడుకుని ఉన్నాను. అదే ఫొటోలు మీడియాలో వచ్చాయి. వాటిని చూసి చాలా మంది నా ఆరోగ్యం క్షీణించిందని అపోహకు గురయ్యారని తెలిసింది. దీనిపై వస్తున్న అనేక కామెంట్లకు సరైన జవాబు ఇవ్వాలని అనుకుంటున్నాను. జగన్‌ గారు రావటానికి ముందే వైద్యచికిత్సలో భాగంగా ఓ ప్రక్రియకు వెళ్లిరావటంతో పడుకునే తనతో మాట్లాడాల్సి వచ్చింది. అంతే తప్ప, మరో ఇబ్బంది లేదు. ఆస్పత్రిలో నేను బాగా కోలుకుంటున్నాను. చికిత్స దృష్ట్యా దాదాపు నెల రోజులకు పైగా మీకు దూరంగా ఉంటున్నాను. త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో మీ మధ్యకు వచ్చి అందరితో కలిసి కుప్పంలో పని చేస్తాను’.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top