మైనారిటీ యూనివర్సిటీ ఏమైంది బాబు? | Minority Leaders Fires On CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

మైనారిటీ యూనివర్సిటీ ఏమైంది బాబు?

Apr 8 2019 1:33 PM | Updated on Apr 8 2019 1:38 PM

Minority Leaders Fires On CM Chandrababu Naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మైనారిటీల మీద కపట ప్రేమ చూపుతున్నారని ఏపీ, తెలంగాణ ఆల్ ఇండియా జమతే ఉలమా ఏ హింద్ ఉపాధ్యక్షుడు ముఫ్తి ఫారూఖ్ విమర్శించారు. సోమవారం లోటస్ పాండ్ లోని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మైనారిటీ నాయకుల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్లుగా ముస్లింల సమస్యలను పట్టించుకోని చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముస్లిలకు ఉప ముఖ్యమంత్రి ఇస్తానని కపట ప్రేమ చూపుతున్నారని మండిపడ్డారు.

చంద్రబాబుకు మైనారిటీలు వద్దని, వారి ఓట్లు మాత్రమే కావాలన్నారు. ఇంతవరకు మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వలేదని, టికెట్స్‌ కూడా సరిగా కేటాయించలేదని దుయ్యబట్టారు. గత ఎన్నికలలో ఇచ్చిన మైనారిటీ యూనివర్సిటీ హామీ సంగతి ఏమైందని ప్రశ్నించారు. ఒక్క కార్పొరేషన్‌ కూడా ముస్లింలకు ఇవ్వని చంద్రబాబు ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇస్తానంటే ఎలా నమ్ముతారన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ముస్లింలకు సముచితన స్థానం కల్సిస్తుందని ప్రశంసించారు. ఏపీలోని ముస్లింలందరు, అన్ని వర్గాలు వైస్సార్ కాంగ్రెస్‌ పార్టీకి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement