విజేతలకు దీదీ కంగ్రాట్స్‌.. | Mamata Tweets All Losers Are Not Losers | Sakshi
Sakshi News home page

విజేతలకు దీదీ కంగ్రాట్స్‌..

May 23 2019 1:52 PM | Updated on May 23 2019 1:52 PM

Mamata Tweets All Losers Are Not Losers   - Sakshi

ఓడినోళ్లంతా పరాజితులు కాదు : దీదీ

కోల్‌కతా : సార్వత్రిక సమరంలో విజేతలకు పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో ఓడిన వారంతా పరాజితులు కారని, దీనిపై తాము సమీక్షించిన తర్వాత తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తామని దీదీ ట్వీట్‌ చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసి వీవీప్యాట్‌ల లెక్కింపు సరిపోల్చే వరకూ వేచిచూడాలని ఆమె వ్యాఖ్యానించారు.

కాగా దేశమంతటా ఎన్డీయే ప్రభంజనానికి తోడు సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ అనూహ్య పోటీ ఎదుర్కొంది. బెంగాల్‌లోని 42 లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీ ఏకంగా 18 నియోజకవర్గాల్లో ఆధిక్యత కనబరుస్తుండగా, తృణమూల్‌ కాంగ్రెస్‌ 23 స్ధానాల్లో ముందంజలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement