దీక్షలో టీడీపీ ఎంపీలూ భాగం కావాలి.. | Malladi Vishnu Pays Solidarity to YSRCP Mps | Sakshi
Sakshi News home page

Apr 1 2018 8:29 PM | Updated on Aug 10 2018 8:42 PM

Malladi Vishnu Pays Solidarity to YSRCP Mps - Sakshi

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి మల్లాది విష్ణు

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రతరం చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలకు రాష్ట్రవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. హోదాకు మద్దతుగా రాజీనామాకు, ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధపడిన పార్టీ ఎంపీలకు సంఘీభావంగా వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి మల్లాది విష్ణు ఆదివారం సాయంత్రం విజవాడలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలతోపాటు టీడీపీ ఎంపీలు కూడా తమ పదవులకు రాజీనామా చేయాలని అన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని పదే పదే మాట్లాడే ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ఎంపీల రాజీనామాల విషయమై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లోని 25 మంది ఎంపీలు ఒకేసారి రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దామంటూ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చిన పిలుపును చంద్రబాబు ఎందుకు స్వాగతించడం లేదని మండిపడ్డారు. వైఎస్సార్‌ సీపీ ఎంపీలు ఢిల్లీలో చేపట్టబోమే ఆమరణ నిరాహార దీక్షలో భాగం కావాలని టీడీపీ ఎంపీలకు హితవు పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement