కుమారస్వామి ఏంటీ పని?

Kumaraswamy Gifted Expensive Articles To MPs Accuses BJP - Sakshi

బెంగళూరు : కర్ణాటక ఎంపీలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రజాధనంతో కాస్ట్‌ లీ గిఫ్ట్స్‌ కొనిచ్చారంటూ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నాయకుడు రాజీవ్‌ చంద్రశేఖర్‌ సంచలన ఆరోపణలు చేశారు. విలువైన ఐఫోన్‌ ఎక్స్‌, లెదర్‌ బ్యాగ్‌లను రాష్ట్ర ఎంపీలకు కుమారస్వామి ఇచ్చారని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. కావేరి సమస్యపై చర్చించేందుకు ఎంపీలందరినీ ఆహ్వానించడాన్ని చంద్రశేఖర్‌ సమర్థించారు.

అయితే, రాష్ట్రం ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే ఎంపీలకు కాస్ట్‌ లీ గిఫ్ట్‌లు అవసరమా? అని నిలదీశారు. కుమారస్వామి పంపిన గిఫ్ట్స్‌ ఇవేనంటూ ఓ ఫొటోను సైతం ట్వీట్‌కు జత చేశారు. అందులో ఐఫోన్‌ ఎక్స్‌తో పాటు ‘మూచీస్‌’ బ్యాగ్‌ ఉన్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top