
సాక్షి, తిరుమల: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కశ్మీర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయానికి దేశ ప్రజలందరూ హర్షించారని తెలిపారు. మోదీ, అమిత్ షా నేతృత్వంలో భారత్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని పేర్కొన్నారు. మోదీ కృషి వల్ల అమెరికా, చైనా తర్వాత భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారిందన్నారు. ప్రస్తుతం దేశ ప్రజలందరూ మోదీ వైపు చూస్తున్నారని తెలిపారు. పార్టీ మార్పుపై సరైన సమసయంలో నిర్ణయం తీసుకుంటానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్ పేరు నిలిపేలా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలన ఉంటుందని ఆశిస్తున్నాను అన్నారు రాజోపాల్ రెడ్డి.