
వేములపల్లి/తిప్పర్తి: 2019 ఎన్నికల్లో తా ను నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని ఎమ్మె ల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. సోమవారం వేములపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. మంత్రి జగదీశ్‌రెడ్డికి, ఎమ్మెల్యే భాస్కర్‌రావులకు డిపాజిట్ దక్కకుండా ఓడిస్తామని శపథం చేశా రు.
మల్లన్న సాగర్, కాళేశ్వరం ప్రాజెక్టుల నీళ్లు మామ, అల్లుడి నియోజకవర్గాలకేనని, అది కూడా రూ.40 వేల కోట్ల కాళే« శ్వరం ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు పెంచి ఆంధ్రా కాంట్రాక్టర్లకు అప్పజెప్పారన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అధికారం ఖాయమని కోమటిరెడ్డి పేర్కొన్నారు.