నేటి నుంచి కేసీఆర్‌ ‘ఫెడరల్‌’ పర్యటన

KCR Federal Front Tour Schedule - Sakshi

ఈ నెల 27 వరకు సీఎం షెడ్యూల్‌ ఖరారు

విశాఖ శారదా పీఠంతో పర్యటన మొదలు

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వరుసగా ఐదు రోజులపాటు వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 23 నుంచి 27 వరకు ఈ పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. పరిస్థితినిబట్టి షెడ్యూల్‌ ఒకటి, రెండు రోజులు అటుఇటుగా ఉండనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబ సభ్యులతో కలసి ఆదివారం ఉదయం 10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి విశాఖపట్నం బయలుదేరుతారు. విశాఖ చేరుకున్నాక శారదా పీఠాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి భువనేశ్వర్‌ వెళ్తారు. సాయంత్రం ఆరు గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో ఆయన నివాసంలోనే సమావేశమవుతారు. ముఖ్యమంత్రి అధికార నివాసంలోనే కేసీఆర్‌ బస చేస్తారు. సోమవారం సైతం ఒడిశాలోనే ఉంటారు. కోణార్క్, పూరీ దేవాలయాలను సందర్శించి సాయంత్రం కోల్‌కతా వెళ్తారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top