నిధుల విడుదలపై బీజేపీ దుష్ప్రచారం: కర్నె

Karne Prabhakar Slams BJP Party Over Funds Release - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐదేళ్లలో తెలంగాణకు కేంద్రం విడుదల చేసిన నిధులకు సంబంధించి రాష్ట్ర బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌ ఆరోపించారు. నిధుల గణాంకాలను కేంద్ర ఆ ర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటు వేదికగా ప్రకటించినా.. బీజేపీ నేతలు అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణకు కేంద్రం మంజూరు చేసిన ని ధులకు సంబంధించి రాష్ట్ర బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలను ఖండించారు. 2014 నుంచి 2019 వరకు ఐదేళ్ల కాలంలో పన్నుల రూపంలో కేంద్రానికి రాష్ట్రం నుంచి రూ.2.72 లక్షల కోట్లు వెళ్లగా, కేంద్రం నుంచి రాష్ట్రానికి మాత్రం రూ. 1.12 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయని గురువారం ఓ ప్రకటనలో వెల్లడిం చా రు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన గణాంకాలపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉ పాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ విమర్శిస్తే బీజేపీ నేతలు ఉలికిపడుతున్నారన్నా రు. ప్రగతిశీల రాష్ట్రాలకు నిధులు కేటాయింపు పెంచాలని సీఎం  పలు సందర్భాల్లో విజ్ఞప్తి చేసినా కేంద్రం పెడచెవిన పెట్టిందన్నారు. తెలంగాణ కు నిధుల విడుదల కోసం కేంద్రంపై ఒత్తిడి చేయాలని బీజేపీ నేతలకు సూచించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top