బెంగుళూరులో టెన్షన్‌.. టెన్షన్‌..

Karnataka Floor Test: Key Points - Sakshi

సాక్షి, బెంగుళూరు : కర్ణాటకలో రాజకీయ సంక్షోభం తుది దశకు చేరుకుంది. బల పరీక్షకు మరికొద్ది గంటలే మిగిలివున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజధాని బెంగళూరులో గల విధానసౌధ వద్ద ఏ క్షణాన ఏం జరగుతుందోనన్న టెన్షన్‌ నెలకొంది.

 • ప్రొటెం స్పీకర్‌ బోపయ్య, ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఇప్పటికే విధానసౌధకు చేరుకున్నారు.
 • బెంగళూరులో బస చేస్తున్న హోటళ్ల నుంచి అన్ని పార్టీల ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు.
 • మిస్సింగ్‌గా ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ సింగ్‌ తిరిగి ఆ పార్టీ గూటికి వచ్చి చేరారు.
 • అసెంబ్లీలోనే బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. కాంగ్రెస్‌-జేడీఎస్‌లు సైతం అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలతో చర్చించనున్నాయి.
 • విధానసౌధ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర డీజీపీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
 • ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 03.55 నిమిషాల వరకూ ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణస్వీకారం చేయిస్తారు.
 • 4 గంటలకు అసెంబ్లీ తలుపులు మూసిన అనంతరం ముఖ్యమంత్రి యడ్యూరప్పను బల నిరూపణ చేసుకోవాలని ప్రొటెం స్పీకర్‌ కోరనున్నారు.
 • బీజేపీకి 104 ఎమ్మెల్యేల మద్దతు ఉండగా, కాంగ్రెస్‌-జేడీఎస్‌లకు 116 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది.
 • విధానసౌధలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం ప్రారంభమైంది.
 • ఎమ్మెల్యేగా బీజేపీ శాసనసభాపక్ష నేత, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ‍ప్రమాణం చేశారు.
 • ప్రొటెం స్పీకర్‌గా బోపయ్య నియామకంపై కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. బోపయ్యనే ప్రొటెం స్పీకర్‌గా కొనసాగుతారని పేర్కొంది.
 • ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కాంగ్రెస్‌-జేడీఎస్‌ల నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోతారని బీజేపీ శ్రేణుల్లో ప్రచారం జరగుతోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top