బాలయ్యకు చుక్కెదురు

Hindupur People Stops Balakrishna Vehicle For Water - Sakshi

కాన్వాయ్‌ను అడ్డుకున్న జనం

నీటికోసం నిలదీసిన మహిళలు

లేపాక్షి చెరువులకు నీరు ఇవ్వాలని డిమాండ్‌

హిందూపురం అర్బన్‌: చుట్టుపు చూపుగా రావడం...శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో హడావుడి చేసే బాలయ్యకు ఈ సారి తీవ్ర పరాభవం జరిగింది. రెండు రోజుల నియోజకవర్గ పర్యటనకు బుధవారం హిందూపురం వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణకు తొలిరోజే చుక్కెదురైంది. చిలమత్తూరులో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు..శంకుస్థాపనలు చేసిన ఆయన లేపాక్షి నంది సర్కిల్‌ వద్దకు రాగానే..జనం ఆయన కారును అడ్డుకున్నారు. బాలకృష్ణ కారు దిగగానే చుట్టుముట్టారు.

హంద్రీనీవా ద్వారా లేపాక్షి మండలంలోని అన్ని చెరువులకు నీళ్లిస్తామని చెప్పి...చిన్న చెరువులను విస్మరించారని మండిడ్డారు. మహిళలైతే తాగేందుకు నీళ్లులేక అల్లాడిపోతున్నామని, పశువులకు నీళ్లు కూడా లేవని మండిపడ్డారు. మీకు చెప్పుకుందామంటే మీరెక్కడుంటారో తెలియకుండా పోయిందన్నారు. పరిస్థితి చేజారుతోందని గ్రహించిన టీడీపీ నాయకులు మల్లికార్జున, ఎంపీటీసీ సభ్యుడు చలపతి, మాజీ ఎంపీపీ ఆనంద్‌ మరికొందరు ‘జై బాలయ్య’ అంటూ నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు. అయినప్పటికీ మహిళలు నీటికోసం గట్టిగా నిలదీశారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని వినతి పత్రం సమర్పించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top