కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణం

HD Kumaraswamy Sworn As Karnataka Chief Minister - Sakshi

సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ పార్టీల కూటమి కొలువుదీరింది. రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా జేడీఎస్‌ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ నేత, పీసీసీ అధ్యక్షుడు బి. పరమేశ్వర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. గవర్నర్‌ వజుభాయ్‌ వాలా కుమారస్వామి, పరమేశ్వరతో ప్రమాణ స్వీకారం చేయించారు. కన్నడలో ప్రమాణ స్వీకార పత్రాన్ని కుమారస్వామి చదివి వినిపించారు. కర్ణాటక సీఎంగా కుమారస్వామి బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. గతంలో 2006 ఫిబ్రవరి 3న తొలిసారి సీఎం అయిన కుమారస్వామి 2007 అక్టోబర్‌ 9వరకు పదవిలో కొనసాగిన విషయం తెలిసిందే. ఈ నెల 25న కుమారస్వామి సర్కార్‌ బలనిరూపణ చేసుకోనుంది. వారం రోజుల తర్వాత రాష్ట్ర కేబినెట్‌ ఏర్పాటు అవుతుంది.

బుధవారం జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి సోనియా గాంధీ, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీలతో పాటు పలు రాష్ట్రాల కీలక నేతలు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, శరద్‌ యాదవ్‌, సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్‌ రెడ్డి, అఖిలేశ్‌ యాదవ్‌, శరద్‌ పవార్‌, పినరయి విజయన్‌, అజిత్‌ సింగ్‌, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తనయుడు తేజస్వీ యాదవ్‌, తదితర కీలక నేతలు కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top