లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తా : హార్దిక్‌ | Hardik Patel To Contest Lok Sabha Polls | Sakshi
Sakshi News home page

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తా : హార్దిక్‌

Feb 6 2019 5:56 PM | Updated on Feb 6 2019 5:56 PM

Hardik Patel To Contest Lok Sabha Polls - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ : పటీదార్‌ రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు హార్దిక్‌ పటేల్‌ త్వరలో జరగబోయే లోక్‌ సభ ఎన్నికలల్లో పోటీకి సిద్ధమయ్యారు. లక్నోలో నిర్వహించిన ర్యాలీలో హర్దిక్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లోనే పోటీ చేసేందుకు హార్దిక్ పటేల్ ప్రయత్నించారు, కానీ వయస్సు సరిపోని కారణంగా పోటీకి దూరంగా నిలిచారు. ఇప్పుడు 25ఏళ్ల వయసు దాటడంతో ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు హర్దిక్‌ సిద్ధమయ్యారు. అయితే ఏ స్థానం నుంచి అత‌ను పోటీ చేస్తాడ‌న్న విష‌యాన్ని ఇంకా వెల్ల‌డించ‌లేదు. (చిన్ననాటి స్నేహితురాలితో హార్ధిక్‌ పెళ్లి)

గుజ‌రాత్‌లోని అమ్రేలీ లేదా మెహ‌సానా స్థానం నుంచి పోటీ చేస్తాడ‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అమ్రేలి నుంచి అభ్యర్థిని నిలబెట్టకుండా హార్దిక్ పటేల్‌కు ఇవ్వనున్నట్లు సమాచారం. 2017లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అమ్రేలీ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉన్న అయిదు స్థానాల్లో  ప‌టేదార్లు గెలిచారు. దీంతో హార్థిక్ ఆ స్థానం నుంచే పోటీప‌డే అవ‌కాశాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement