
న్యూఢిల్లీ: ఇటీవల బీజేపీలో చేరిన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తూర్పు ఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరఫున బరిలో నిలువనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ అధిష్టానం సోమవారం ప్రకటన విడుదల చేసింది. న్యూఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీగా కొనసాగుతున్న మీనాక్షి లేఖి తిరిగి అదే స్థానం నుంచి ఎంపీగా నిలుపనున్నట్టు తెలిపింది. కాంగ్రెస్, ఆప్‌లు మధ్య పొత్తు ప్రతిపాదన కార్యరూపం దాల్చకపోవడంతో ఢిల్లీ ఇరు పార్టీలు ఒంటరి పోరుకు సిద్దమయ్యాయి. కాగా, తూర్పు ఢిల్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున అరవిందర్ లవ్లీ బరిలో ఉన్నారు. ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలకు మే 12న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.