‘పీఎం, సీఎంలకూ పరిమితి విధించాలి’ | Fix number of terms for people in PM, CM chairs | Sakshi
Sakshi News home page

‘పీఎం, సీఎంలకూ పరిమితి విధించాలి’

Jul 1 2018 3:31 AM | Updated on Mar 18 2019 7:55 PM

 Fix number of terms for people in PM, CM chairs - Sakshi

భోపాల్‌: ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవులను ఒకే వ్యక్తి ఎన్ని పర్యాయాలు చేపట్టవచ్చుననే దానిపై పరిమితి విధించాలని కాంగ్రెస్‌ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా డిమాండ్‌ చేశారు. అమెరికా వంటి దేశాల్లో ఒకే వ్యక్తి అధ్యక్ష పదవిని రెండుసార్లకు మించి చేపట్టరాదనే నిబంధన ఉంది. శనివారం ఆయన భోపాల్‌లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిటైరయ్యే ఉన్నతాధికారుల పదవీకాలం పొడిగిస్తుండటంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రిటైరయ్యే అధికారి, ఆ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్న వారికి పదవిని అప్పగించి వెళ్లిపోవాలని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement