
సాక్షి, అమరావతి: నవ నిర్మాణ దీక్ష పేరుతో ఏటా ప్రజల్లోకి వెళ్తున్నామని, కేంద్రం నమ్మించి ఏపీని ఏవిధంగా మోసం చేసిందో వివరిస్తున్నామని ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఎలా ముందుకు సాగాలన్న అంశంపై సమావేశంలో చర్చించామని వెల్లడించారు. రైతు బిడ్డలను సాంకేతిక నిపుణులుగా మార్చిన వైనంపై సమావేశంలో చర్చించామని తెలిపారు.
మూడవ ధర్మపోరాటం రాజమహేంద్రవరం వేదికగా, నాలుగో ధర్మపోరాటం రాయలసీమ వేదికగా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నామన్నారు. వర్సిటీలు వేదికగా 10 సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గ్రామదర్శినిలో ప్రతి కుటుంబాలను పలకరించినపుడు వారు పలు విషయాలు చెప్పారని, వాటిపై కూడా సమావేశంలో చర్చించామని కాల్వ శ్రీనివాసులు తెలిపారు.