వారం రోజుల్లో అనేక రాజకీయ పరిణామాలు | Deve Gowda his son Kumaraswamy Visits Tirumala Temple | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ 135 సీట్లు గెలుస్తుంది: చింతా మోహన్‌

May 18 2019 9:47 AM | Updated on May 18 2019 11:48 AM

Deve Gowda his son Kumaraswamy Visits Tirumala Temple - Sakshi

తిరుమల శ్రీవారి దర్శించుకునేందుకు వచ్చిన మాజీ ప్రధానమంత్రి దేవెగౌడను కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు.

సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారి దర్శించుకునేందుకు వచ్చిన మాజీ ప్రధానమంత్రి దేవెగౌడను కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చింతా మోహన్‌ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ పతనం ప్రారంభమైందని, కేంద్రంలో సెక్యులర్‌ ప్రభుత్వం ఏర్పడుతుందని వ్యాఖ‍్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే వారం రోజుల్లో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని చింతా మోహన్‌ పేర్కొన్నారు.

35 ఏళ్లుగా శ్రీవారిని దర్శించుకుంటున్నా
అంతకు ముందు దేవెగౌడ తన కుమారుడు, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ‘పుట్టిన రోజు సందర్భంగా 35 ఏళ్లుగా శ్రీవారిని దర్శించుకుంటున్నా. ప్రధాని పదవిని ఎవరు అధిరోహిస్తారో తెలియదు. మేం మాత్రం కాంగ్రెస్‌ పార్టీతో ఉన్నాం.’ అని అన్నారు. కర‍్ణాటక సీఎం కుమారస్వామి మాట్లాడుతూ.. కర్ణాటకలో జేడీఎస్‌, కాంగ్రెస్‌ కూటమి 18 సీట్లు గెలుస్తుందని జోస్యం చెప్పారు. సకాలంలో వర్షాలు కురిసి కర్ణాటక, తమిళనాడు రైతుల సాగునీటి సమస్య తీరాలని దేవుడిని ప్రార్థించానని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement