మాది గజ్వేల్‌.. మీ ఊరెక్కడ? 

Congress Leader Narsa Reddy Question To KCR Over Localism - Sakshi

కేసీఆర్‌ స్థానికతపై నర్సారెడ్డి

తూప్రాన్‌: గజ్వేల్‌ నియోజకవర్గంలోని ప్రతాప్‌రెడ్డిది బూరుగుపల్లి, తనది వర్గల్‌ అని, కేసీఆర్‌ ఊరు ఎక్కడో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం తూప్రాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డితో నర్సారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ.. తమ ప్రాంత నాయకులపై అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఈ నాలుగున్నరేళ్లలో గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధి శూన్యమని నర్సారెడ్డి ఆరోపించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ నేతలు ఉమ్మన్నగారి భాస్కర్‌రెడ్డి, నాయిని యాదగిరి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top