
సాక్షి, హైదరాబాద్: పదిహేను నిమిషాలు పోలీసులను పక్కన పెట్టమన్న కుక్క ఇప్పుడు ఎల్బీ స్టేడియంకు రాగలదా అంటూ గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ ప్రశ్నించారు. సోమవారం స్థానిక ఎల్బీ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరైన బహిరంగ సభలో రాజాసింగ్ మాట్లాడారు. హైదరాబాద్‌కు మోదీ వస్తే ఆయన సంగతి చూస్తానన్న దేశ ద్రోహి ఇప్పుడు ఎక్కడా అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ సర్కార్‌కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒకసారి టీఆర్‌ఎస్‌కు అవకాశమిస్తే ఎలాంటి అభివృధ్ది జరగలేదని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ రావాలని కోరుకునే వాళ్లు.. సెల్‌ఫోన్ లైట్స్ వేయాలని కోరడంతో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.