పవన్‌ క్షమాపణలు చెప్పాలి : కోట సాయికృష్ణ

BJP Kota Saikrishna Fires On Pawan Kalyan - Sakshi

సాక్షి, విజయవాడ : హిందూ మతంపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను బీజేపీ అధికార ప్రతినిధి కోట సాయికృష్ణ ఖండించారు. పవన్‌ కల్యాణ్‌వి అపరిపక్వ రాజకీయాలని విమర్శించారు. పవన్‌ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. హిందువుల మనోభావాలను పవన్‌ అవమానించారని తెలిపారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ పూర్తిగా ఖండిస్తోందన్నారు. హిందూ మతంపై చేసిన వ్యాఖ్యలను పవన్‌  వెనక్కి తీసుకోని.. హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీనిపై పవన్‌ బహిరంగ చర్చకు సిద్దమా అని సవాలు విసిరారు.

మరోవైపు వీహెచ్‌పీ నేతలు కూడా పవన్‌ వ్యాఖ్యలను ఖండించారు. పవన్‌ వెంటనే క్షమాపణ చెప్పాలని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్‌ డిమాండ్‌ చేశారు. పవన్‌కు పిచ్చిపట్టినట్లుందని వ్యాఖ్యానించారు. హిందువులను అగౌరవపరిచేలా మాట్లాడటం సరికాదని సూచించారు.

చదవండి:
హిందూ మతంపై పవన్‌ సంచలన వ్యాఖ్యలు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top