‘రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి’ | BJP demands High Court should be set up in Rayalaseema | Sakshi
Sakshi News home page

Feb 26 2018 1:12 PM | Updated on Aug 31 2018 8:40 PM

BJP demands High Court should be set up in Rayalaseema - Sakshi

బీజేపీ నేత రఘునాథ్‌ బాబు

సాక్షి, విజయవాడ : రాయలసీమలోనే హైకోర్టు ఏర్పాటు చేయాలని బీజేపీ నేత రఘునాథ్‌ బాబు డిమాండ్‌ చేశారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. రాయలసీమ బిడ్డగా సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమకు ఏం చేశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రాయలసీమకు అన్యాయం జరిగిన మాట వాస్తవమని, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు అడగడంలో అర్థం ఉందని తెలిపారు.

అభివృద్ధి వికేంద్రీకరణ ఉత్తరాంధ్ర, రాయలసీమలోనే ఎక్కువగా జరగాలని రఘునాథ్‌ బాబు డిమాండ్‌ చేశారు. రాయలసీమలో సుప్రీం కోర్టు బెంచ్‌, అమరావతిని దేశ రెండో రాజధానిగా చేయమని సీఎం చంద్రబాబు అడగడంలో అర్థం లేదన్నారు. దేశానికి రెండో రాజధాని, సుప్రీం బెంచ్‌ను ఎక్కడైనా ఏర్పాటు చేయొచ్చన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement