
అజారుద్దీన్
హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్ తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని..
సాక్షి, హైదరాబాద్ : తనపై బీసీసీఐ నిషేధం విధించలేదని, తాను హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు మాజీ క్రికెటర్, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అజారుద్దీన్ ప్రకటించారు. శనివారం ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్ తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్ ప్రజల మద్దతు తనకుందని తెలిపారు. అజారుద్దీన్ సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని ఇటీవల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. హైకమాండ్ ఆదేశిస్తే తాను సిద్దంగా ఉన్నానంటూ కూడా ఆయన ప్రకటించారు. ఇదే విషయంపై గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే.