లెజెండ్‌ సంగం లక్ష్మీబాయి

Article On Legend Sangam Laxmi Bai - Sakshi

సేవా కార్యక్రమాలతో చెరగని ముద్ర

మహిళలు, బాలికల సంరక్షణే లక్ష్యంగా కృషి

ఏపీ నుంచి లోక్‌సభకు ఎన్నికైన తొలి మహిళ

సాయుధ పోరాటంతో పాటు స్వాతంత్య్ర సంగ్రామంలో మహిళలను ముందుండి నడిపించిన ధీర వనిత సంగం లక్ష్మీబాయి. సామాజిక సేవకు పూర్తి సమయం వెచ్చించిన మానవతా మూర్తిగా.. బాలికలు, స్త్రీ సంరక్షణకు అలుపెరగక కృషి చేసి ఆత్మబంధువుగా ఆమె గుర్తింపు పొందారు. ఖద్దరు చీర ధరించి వీసమెత్తు బంగారం కూడా సంపాదించకుండా రాజకీయ విలువలను పెంచిన యోధురాలు. సాదాసీదా జీవితాన్ని గడిపి అందరికీ ఆదర్శంగా నిలిచిన ఎస్‌ఎల్‌ లక్ష్మీబాయి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి లోక్‌సభకు ఎన్నికైన తొలి మహిళ కావడం విశేషం.

రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లో లక్ష్మీబాయి జన్మించారు. తల్లిదండ్రులు సీతమ్మ, దొంతుల రామయ్య. మొదట్లో పెట్టిన పేరు సత్తెమ్మ. పెళ్లయిన తర్వాత అత్తింటి వారు లక్ష్మీబాయిగా మార్చారు. స్కూల్‌ రికార్డులో మేనమామ సంగె సీతారామయ్యయాదవ్‌ ఆమె ఇంటి పేరును సంగం అని రాయించడంతో సంగం లక్ష్మీబాయిగా మారింది. చురుకైన అమ్మాయి కావడంతో మాడపాటి హనుమంతరావు దృష్టిలో పడింది. గుంటూరులోని శారదానికేతన్‌లో చదివించాలన్న ఆయన సలహాతో 1926లో లక్ష్మీబాయిని అక్కడ చేర్పించారు. 1927లో విద్వాన్‌ పాస్‌ అయిన ఆమె ఎనిమిదేళ్లు అక్కడే ఉండి హిందీలో సాహితీ, విదూషీ డిగ్రీలు తీసుకున్నారు. ఆ సమయంలోనే స్వాతంత్య్ర సమరం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది.

మాతృభూమి విముక్తి కోసం తాను సైతం అంటూ ముందుకొచ్చారు. సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా ఉద్యమించారు. 1930లో గాంధీ పిలుపునందుకుని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఊరూరా తిరుగుతూ ప్రజల్లో చైతన్యం తెచ్చారు. కల్లు, సారా, విదేశీ వçస్త్ర దుకాణాల ఎదుట సత్యాగ్రహ దీక్షలు చేసి ఎన్నోసార్లు అరెస్ట్‌ అయ్యారు. జైలులో ఉండి కూడా ఉద్యమ పంథాను కొనసాగించారు. మహిళల కోసం జైలులో ప్రత్యేక గదులు కట్టాలని పోరాడారు. 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని ఏడాది జైలుశిక్ష అనుభవించారు. 1933లో మద్రాసు వెళ్లన లక్ష్మీబాయి చిత్రకళలో డిప్లొమా పొందారు. ఐదేళ్లు అక్కడే ఉన్న ఆమె 1938లో హైదరాబాద్‌కు వచ్చి గుల్బర్గా బాలికల స్కూల్‌లో డ్రాయింగ్‌ టీచర్‌గా చేరారు. ఆ సమయంలోనే నారాయణగూడలోని రాజ్‌బహుదూర్‌ వెంకట్రాంరెడ్డి ఉమెన్స్‌ కాలేజీ హాస్టల్‌కు గౌరవ వార్డెన్‌గా వ్యవహరించారు. ఆ తరువాత ఉద్యోగాన్ని వదిలి సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. 

తెగువ.. సేవ ఆమె సొంతం
షహీద్‌ షోయబుల్లాఖాన్‌ను రజాకార్లు చంపినప్పుడు ఆయన కుటుంబసభ్యులను పలకరించడానికి ప్రజలు భయపడ్డారు. అయినా.. లక్ష్మీబాయి జంకలేదు. షోయబుల్లాఖాన్‌ ఇంటికెళ్లి అతడి కుటుంబాన్ని ఓదార్చడంతోపాటు ఆదుకున్నారు. దేశంలో హైదరాబాద్‌ విలీనమైన తర్వాత లక్ష్మీబాయి తన సేవా కార్యక్రమాలను విస్తరించారు. 1950లో భూదానోద్యమ యాత్ర కోసం తెలంగాణకు వచ్చిన ఆచార్య వినోబా బావే ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించారు. ఆయన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు 16 గ్రామాలు తిరిగి 314 ఎకరాల భూమిని సేకరించారు. 1952లో సంతోష్‌నగర్‌ చౌరస్తాలో రెండెకరాల్లో ఉన్న సొంత ఇంటిలో స్త్రీ సేవాసదన్‌ను ప్రారంభించారు. ఇప్పుడు దాన్ని ఐఎస్‌ సదన్‌ అని పిలుస్తున్నారు.

1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నుంచి హైదరాబాద్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బూర్గుల రామకృష్ణారావు కేబినెట్‌లో డిప్యూటీ విద్యాశాఖ మంత్రిగా 1954 నుంచి 1956 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె హయాంలోనే తెలంగాణ జిల్లాల్లో బాలికల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు ప్రారంభమయ్యాయి. మంత్రిగా సంపాదించిన ప్రతి పైసాను స్త్రీ సేవాసదన్‌కు ఉపయోగించారు. 1955లో దాన్ని తన సహచరులైన కేవీ రంగారెడ్డి, ఎ.శ్యామలాదేవి, పి.లలితాదేవి, పాశం పాపయ్య, ఎం.భోజ్‌రెడ్డితో కలిసి ఇందిరా సేవాసదన్‌గా రిజిస్టర్‌ చేయించారు. అనాథ మహిళలు, శిశువులకు ఉచిత విద్యనందించారు.

‘సదన్‌’లోనే శాశ్వత విశ్రాంతి.. 
ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, సంక్షేమ సలహా బోర్డు కోశాధికారిగా, హైదరాబాద్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ మహిళా విభాగం కన్వీనర్‌గా, ఆంధ్ర మహిళా సభ సభ్యురాలిగా, ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధికారిగా, అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ అధికారిగా లక్ష్మీబాయి సమర్థవంతంగా పనిచేశారు. మహిళాభ్యుదయం, సమస్యలపై రేడియో, వివిధ వేదికలపై చేసిన ప్రసంగాలు ‘నా అనుభవాలు ’ పేరుతో పుస్తకం వెలువరించారు. స్వాతంత్య్ర సమరయోధురాలిగా గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెకు తామ్రపత్రం ఇచ్చి గౌరవించింది. అయితే ఐఎస్‌ సదనం సరైన నిర్వహణ లేక మూతపడింది. జీవితం మొత్తం సదనంతో ముడిపడి ఉన్నందున తనను అక్కడే సమాధి చేయాలన్న లక్ష్మీభాయి చివరి కోరిక నెరవేరింది.

నెహ్రూ, ఇందిర చేయూతతో..
లక్ష్మీబాయి సేవల గురించి తెలుసుకున్న నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ స్వయంగా వచ్చి సాయం చేశారు. నాటి డిప్యూటీ సీఎం కొండా వెంకటరంగారెడ్డితో పాటు ఇందిరాగాంధీ కూడా సేవా సదనం నిర్వహణకు తోడ్పడ్డారు. రాధికా మెటర్నిటీ హోం, వాసు శిశువిహార్, మాశెట్టి హనుమంతు గుప్త గర్ల్స్‌ హైస్కూల్‌ స్థాపనలో లక్ష్మీబాయిదే కీలకపాత్ర. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడ్డాక 1957లో మెదక్‌ లోక్‌సభ నుంచి పోటీ చేసిన లక్ష్మీబాయి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆపై 1962, 67లోనూ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 14 ఏళ్లు పార్లమెంట్‌ సభ్యురాలిగా వ్యవహరించారు. 1972లో ఇందిరా సేవాసదనంలో ఈవెనింగ్‌ కాలేజీగా ఇందిరా ఓరియెంటల్‌ కాలేజీ నడిపి ఎందరో విద్యార్థులకు బంగారు బాట చూపించారు. 1979లో కేన్సర్‌తో చనిపోయే వరకు బాలికలు, స్త్రీ సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేశారు.
-కిషోర్‌ పెరుమాండ్ల, మెదక్‌ 

మరిన్ని వార్తలు

18-03-2019
Mar 18, 2019, 11:30 IST
సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి వివేకానందరెడ్డి మరణంపై మంత్రి నారా లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలు దారుణమని ఆ...
18-03-2019
Mar 18, 2019, 11:25 IST
ద్వారకాతిరుమల/ఉంగుటూరు: ఉంగుటూరు నియోజకవర్గంలో భీమడోలులో జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు సభకు జనాదరణ కరువైంది. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల...
18-03-2019
Mar 18, 2019, 11:11 IST
చంద్రబాబు అందువల్లే అభ్యర్థుల ప్రకటనలో జాప్యం చేస్తున్నారని...
18-03-2019
Mar 18, 2019, 10:51 IST
ఎన్నికల సమరానికి వైఎస్సార్‌ సీపీ సై అంది. జిల్లాలోని ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ఒకే విడతలో ప్రకటించింది. అనుభవానికి, నమ్మకానికి వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట...
18-03-2019
Mar 18, 2019, 10:49 IST
సాక్షి,సిటీబ్యూరో: లోక్‌సభ ఎన్నికల కోలాహలం మొదలైంది. మహానగరం పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల స్థానాలకు సోమవారం నుంచి నామినేషన్ల...
18-03-2019
Mar 18, 2019, 10:32 IST
అప్పారావు: ఏందిరో సుబ్బారావు ఏదో ఆలోచనలో పడ్డావ్‌. సుబ్బారావు: ఏం లేదురా! ఏ పనీపాటా లేదని ఇంట్లో వాళ్లు రోజూ తిట్టరాని...
18-03-2019
Mar 18, 2019, 10:18 IST
సాక్షి, రాచర్ల (ప్రకాశం): వైఎస్సార్‌ సీసీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలపై గ్రామాల్లోని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ,...
18-03-2019
Mar 18, 2019, 09:55 IST
సాక్షి, చీరాల (ప్రకాశం): ఆయన వృత్తి రీత్యా వైద్యుడు. ప్రవృత్తి మాత్రం రాజకీయం. వైద్య వృత్తిలో ఎండీ డిగ్రీ చేసి గైనకాలజిస్ట్‌గా సేవలందించి...
18-03-2019
Mar 18, 2019, 09:51 IST
సాక్షి, హిందూపురం: దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తున్న 1,500 చీరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం రాత్రి దివాకర్‌ ట్రావెల్స్‌కు...
18-03-2019
Mar 18, 2019, 09:43 IST
సాక్షి, పాలకొండ: ఎట్టకేలకు పాలకొండ టీడీపీ టికెట్‌ నిమ్మక జయకృష్ణకు ఖరారు చేశారు. ఆ పార్టీ తరఫున అరకు పార్లమెంటు అభ్యర్థిగా...
18-03-2019
Mar 18, 2019, 09:40 IST
సాక్షి, కృష్ణా : కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తెలంగాణా సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు  పుచ్చలపల్లి సుందరయ్యను గన్నవరం వాసులు...
18-03-2019
Mar 18, 2019, 09:38 IST
సాక్షి, అద్దంకి (ప్రకాశం​): టీడీపీ ప్రభుత్వం వృద్ధులకు పింఛన్‌ పెంచాం. అర్హులందరికీ పింఛన్లు ఇస్తున్నామని చెప్పే మాటల్లో నిజంలేకుండా పోయింది. వృద్ధులకు ఆసరా...
18-03-2019
Mar 18, 2019, 09:33 IST
సాక్షి టాస్క్‌ఫోర్స్‌: బీకే పార్థసారథిని పెనుకొండ ఎంతగానో ఆదరించింది. బీసీ వర్గమని ఓటర్లంతా నెత్తినపెట్టుకుని తిరిగారు. తమ సమస్యలు తీరుస్తాడన్న...
18-03-2019
Mar 18, 2019, 09:31 IST
అమ్మ ఒడి.. పేరు ఎంత అందమైనదో పథకమూ అంత అపురూపమైనది. ఆర్థిక స్థోమత కారణంగా చదువులకు దూరమైపోతున్న మధ్య, పేద...
18-03-2019
Mar 18, 2019, 09:30 IST
సాక్షి, సిటీబ్యూరో: లోక్‌సభ ఎన్నికల కోసం నేటినుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుంది. బరిలో దిగే అభ్యర్థులకు జిల్లా కలెక్టర్,...
18-03-2019
Mar 18, 2019, 09:26 IST
సికింద్రాబాద్‌: రాష్ట్రంలోనే సికింద్రాబాద్‌ అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. వీటికి ఇప్పటివరకు ముప్పైరెండు సార్లు ఎన్నికలు జరగాయి. కానీ...
18-03-2019
Mar 18, 2019, 09:17 IST
సాక్షి, సిటీబ్యూరో: లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల పర్వంనేటినుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్‌...
18-03-2019
Mar 18, 2019, 09:11 IST
సాక్షి, శ్రీకాకుళం: ఓటర్లను తమ దారిలోకి తెచ్చుకోవాలంటే పలు రకాల తాయిలాలతో ఆకర్షిస్తుంటారు. అయితే చేతిలో నోటు పెట్టినా సంతృప్తి చెందని...
18-03-2019
Mar 18, 2019, 09:11 IST
పచ్చని పల్లె సీమలు, ఆధునిక పట్టణాల కలబోతగా కనిపించే ప్రాంతం చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం. దశాబ్ద చరిత్ర కలిగిన ఈ...
18-03-2019
Mar 18, 2019, 09:09 IST
‘గారడీ మాటలతో కాలం గడిపారు. టక్కరి వ్యవహారాలతో ప్రజలను మభ్యపెట్టారు. జిల్లాలో అభివృద్ధికి కంటకులుగా మారారు. ఐదేళ్లు కరువుతో జిల్లా...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top