‘దళితుల పట్ల చంద్రబాబు నిర్లక్ష్య వైఖరి’

AP YSRCP Ministers Comments On TDP Leaders - Sakshi

సాక్షి, అమరావతి: ఐదేళ్లు టీడీపీ పాలనలో దళితుల పట్ల చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు కల్పిస్తూ చట్టం తీసుకురావడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. బలహీన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రవేశ పెడుతుంటే బిల్లును అడ్డుకునేందుకు టీడీపీ గందరగోళం చేసిందని మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల అనంతరం.. మీడియా పాయింట్‌లో మంత్రి బొత్స మాట్లాడుతూ.. దళితులు, బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సీఎం వైఎస్‌ జగన్‌ నిరూపించారని అన్నారు. మరోవైపు మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం చరిత్రలో సువర్ణ అధ్యాయనమని పేర్కొన్నారు.  నామినేషన్‌ పదవుల్లో కూడా 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం గొప్ప విషయమని కొనియాడారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top