‘ఏబీఎన్‌ రాధకృష్ణపై ఫిర్యాదు చేస్తాం’ | AP Government Employee Union President KR Suryanarayana Fires On ABN Radhakrishna | Sakshi
Sakshi News home page

రాధాకృష్ణ మాటలను సమర్థించడం సిగ్గుచేటు

Apr 10 2019 1:05 PM | Updated on Apr 10 2019 1:11 PM

AP Government Employee Union President KR Suryanarayana Fires On ABN Radhakrishna - Sakshi

సాక్షి, విజయవాడ : ఉద్యోగుస్తులను కించపరిచేలా మాట్లాడిన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మాటలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థించడం సిగ్గు చేటని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగస్తులను కించపరిచేలా మాట్లాడిన రాధాకృష్ణపై ఎన్నికల సంఘంతో పాటు ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల పేరుతో ప్రభుత్వానికి తొత్తులుగా వారిపై ఎన్నికల కమిషన్‌ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల విధుల నిర్వహణకు డ్యూటీలు వేసి వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం ఎందుకు కల్పించడంలేదో సమాధానం చెప్పాలన్నారు. ఉద్యోగులకి ఓటు హక్కు లేకుండా చేస్తున్న వారిని ఉపేక్షించేది లేదన్నారు. ఎన్నికల నిర్వహణకు వెళ్లే ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకన్నతర్వాతే విధులకు హాజరు కావాలని సూచించారు.

 ఇది చదవండి : ఆ.. నా కొడుకులకు జీతాలివ్వడానికా పన్నులు వసూలు చేసేది?

Advertisement
 
Advertisement
Advertisement