బీజేపీలో చేరిన అన్నం సతీష్‌ ప్రభాకర్‌ | Annam Satish Prabhakar Joins BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరిన అన్నం సతీష్‌ ప్రభాకర్‌

Jul 12 2019 1:58 PM | Updated on Jul 12 2019 2:01 PM

Annam Satish Prabhakar Joins BJP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ పదవికి, తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి ఇటీవల రాజీనామా చేసిన సీనియర్‌ నాయకుడు అన్నం సతీష్‌ ప్రభాకర్‌ కాషాయ కండువా కప్పుకున్నారు. శుక్రవారం ఆయన బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. జేపీ నడ్డా ఈ సందర్భంగా అన్నం సతీష్‌ బాబుకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.  సతీష్‌ ప్రభాకర్‌ నిన్న పార్లమెంటులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డితో భేటీ అయ్యారు. కాగా గుంటూరు జిల్లాలో సీనియర్‌ నేతగా పేరొందిన సతీష్‌.. పార్టీకి రాజీనామా చేయడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాశంగా మారింది. 2014 ఎన్నికల్లో బాపట్ల అసెంబ్లీ నుంచి పోటీచేసిన సతీష్‌.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కోన రఘుపతి చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. బుధవారం ఆయన ఎమ్మెల్సీ పదవితో పాటు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

చదవండి: టీడీపీకి రాజీనామా.. లోకేష్‌పై ఘాటు విమర్శలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement