కుమారస్వామి సీఎం కాగా... మేం కాలేమా?

Akbaruddin Owaisi Sensational Comments On KCR - Sakshi

అక్బరుద్దీన్‌ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌: ‘కుమారస్వామి సీఎం కాగా లేంది... మేం కాలేమా?’అని ఎంఐఎం అగ్రనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌ నాంపల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పక్కన ఉన్న కర్ణాటకలో జేడీఎస్‌ పార్టీ నుంచి కుమారస్వామి సీఎం కాగా లేంది.. తెలంగాణలో తమ పార్టీ అభ్యర్థి సీఎం ఎందుకు కాలేరని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించనున్నట్లు స్పష్టం చేశారు. నవంబర్‌లో ఎన్నికలు.. డిసెంబర్‌లో తానే సీఎం అని కేసీఆర్‌ ప్రకటించడంపై ఆయన ఇలా స్పందించారు. ఈ ఎన్నికల్లో పార్టీ విజయం సాధి స్తుందని, డిసెంబర్‌లో ప్రభుత్వ ఏర్పాటులో తమ పార్టీ కీలకంగా మారనుందన్నారు. ఆ సమయంలో తమకు మద్దతుగా నిలిచిన వారితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top