ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అల్పాదాయ మధ్య తరగతి కుటుంబాలకు ప్రయోజనం కలగడం లేదు.
ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అల్పాదాయ మధ్య తరగతి కుటుంబాలకు ప్రయోజనం కలగడం లేదు. ముఖ్యంగా ఏడాదికి లక్షా యాభై వేల రూపాయలకు పైబడిన ఆదాయం ఉన్న వారి విషయానికివస్తే, ప్రభుత్వం పేదలకు అం దిస్తున్న ఏ ఒక్క సంక్షేమ పథకం వీరికి వర్తించ దు. మధ్య తరగతి ప్రజలు ఏడాదికి రూ. రెండు, మూడు లక్షలు సంపాదిస్తున్నా నిత్యావసరాల ధరలు, పెరిగిన ఇంటి అద్దెలు, పిల్లల చదువుకు ఫీ జులు కట్టలేక వైద్య ఖర్చులు భ రించలేక ఇబ్బందులు పడుతుం టారు.
సమాజంలో నిరుపేదల బతుకు కన్న అటు ఇటు కాని మధ్య తరగతి ప్రజల జీవితం రాను రానూ దుర్భరమైపోతోంది. కాబట్టి ప్రభు త్వాలు మధ్యతరగతి ప్రజల బతుకులపై అధ్య యనం చేయించి వారికి న్యాయం చేయాలని, సంక్షేమ పథకాలను వీరికీ వర్తింపచేయాలని విజ్ఞప్తి.
- గర్నెపూడి వెంకట రత్నాకర్‌రావు, వరంగల్