ధాన్యం అమ్మితే వడ్డీకింద జమ | money to be Deposited under interest selling paddy | Sakshi
Sakshi News home page

ధాన్యం అమ్మితే వడ్డీకింద జమ

Dec 13 2014 1:18 AM | Updated on Oct 1 2018 2:11 PM

రాష్ర్టంలోని రైతుల ఖాతాలన్నీ బ్యాంకులలో ఉన్నందున కొనుగోలు కేంద్రాలలో ధాన్యం అమ్మిన..

రాష్ర్టంలోని రైతుల ఖాతాలన్నీ బ్యాంకులలో ఉన్నందున కొనుగోలు కేంద్రాలలో ధాన్యం అమ్మిన వారి బ్యాంక్ అకౌంట్‌లకు సొమ్ము వెళ్లడం తో వారు అప్పుల కింద, వడ్డీ కింద జమ చేసుకుంటున్నారు. వ్యవ సాయ పెట్టుబడికి వడ్డీ వ్యాపారుల వద్ద నాలుగైదు రూపాయలకు వడ్డీ లకు తెచ్చి పండించిన పంట సొమ్ము బ్యాంకులు జమ చేసుకుంటు న్నాయి. రైతన్నకు నెత్తిన చేతులే. వడ్డీలకు వడ్డీలు కట్టి చివరకు ఉన్న కాస్త కొండ్రా అమ్మి అప్పులు తీర్చాల్సిందే. కొనుగోలు కేంద్రాలలో కొన్న ధాన్యానికి 24 గంటలలో సొమ్ము వారి అకౌంట్‌లకెళతాయని సీఎం చెప్పడంతో నమ్మిన రైతులు ఇప్పుడు నట్టేటమునిగారు.

అప్పు లేని బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేయమని, టీడీపీ నాయకులు ఇప్పుడు సలహా ఇస్తున్నారు. అదే ముందుగా తెలియజేస్తే అన్నదాతలకు ఈ సమస్య వచ్చేది కాదు కదా! ప్రభుత్వం వెలుగు గ్రూపు సభ్యుల ద్వారా, ప్రాథమిక సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలుకు యత్నిస్తూ ఆదేశాలిచ్చినా పౌరసరఫరాల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటు న్నారు. ఇంతవరకూ జిల్లా నుండి ఎంత ధాన్యం లభ్యమవుతుందనే దానిపై వ్యవసాయాధికారులను ప్రభుత్వం సంప్రదించలేదు. దీంతో అన్నదాత కనీస మద్దతు ధర కూడా లేకుండానే బైట వ్యాపారులకు అమ్ముకోవలసిన దుస్థితి వచ్చింది. ప్రభుత్వం తక్షణం స్పందించాలి.
 కేవీ ఫణిప్రభాకర్  కాకినాడ, తూ.గో. జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement