గ్రహం అనుగ్రహం, గురువారం 25, జూన్ 2015 | Graham anugraham of the day on June 25, 2015 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, గురువారం 25, జూన్ 2015

Jun 25 2015 3:11 AM | Updated on Sep 3 2017 4:18 AM

గ్రహం అనుగ్రహం, గురువారం 25, జూన్ 2015

గ్రహం అనుగ్రహం, గురువారం 25, జూన్ 2015

శ్రీ మన్మథనామ సంవత్సరం

శ్రీ మన్మథనామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
అధిక ఆషాఢ మాసం
తిథి శు.నవమి తె.5.23 వరకు
(తెల్లవారితే శుక్రవారం)
నక్షత్రం హస్త రా.8.41 వరకు వర్జ్యం ...లేదు
దుర్ముహూర్తం ఉ.9.54 నుంచి 10.44 వరకు
తదుపరి ప.3.07 నుంచి 3.57 వరకు
అమృతఘడియలు  ప.2.01 నుంచి 3.44 వరకు
సూర్యోదయం:  5.31
సూర్యాస్తమయం:  6.33
రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు

భవిష్యం
 
 మేషం: ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. విలువైన సమాచారం. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ముందడుగు వేస్తారు. దైవదర్శనాలు చేసుకుంటారు.

 వృషభం: పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య భంగం. శ్రమ మరింత పెరుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు.

 మిథునం: రుణాలు చేయాల్సి వస్తుంది. దూర ప్రయాణాలు. ఇంటా బయటా చికాకులు. బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఉద్యోగులపై అదనపు భారం పడే అవకాశం ఉంది.

 కర్కాటకం: కుటుంబ సౌఖ్యం. విలువైన వస్తువులు సేకరిస్తారు. పరపతి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో నూతనోత్సాహం. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉంటాయి.

 సింహం: బంధువులతో వివాదాలు చెలరేగుతాయి. దూరప్రయాణాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దైవదర్శనాలు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో చికాకులు నెలకొంటాయి.

 కన్య: శుభకార్యాలలో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. విందువినోదాలు. యత్న కార్యసిద్ధి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

 తుల: పనులలో స్వల్ప ఆటంకాలు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

 వృశ్చికం: వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఇంటా బయటా ప్రోత్సాహం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

 ధనుస్సు: ఉద్యోగ యత్నాలు సానుకూలం. ఆర్థికాభివృద్ధి. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

 మకరం: ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. దూరప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పైస్థాయి నుంచి ఒత్తిడులు.

 కుంభం: రుణయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. ఆలోచనలు కలిసిరావు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు శ్రమాధిక్యం. దైవచింతన.

 మీనం: కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక ప్రగతి. ఆస్తిలాభం. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి.
 - సింహంభట్ల సుబ్బారావు

Advertisement
 
Advertisement
Advertisement