గ్రహం అనుగ్రహం, మంగళవారం 4, ఆగస్టు 2015 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, మంగళవారం 4, ఆగస్టు 2015

Published Tue, Aug 4 2015 12:39 AM

గ్రహం అనుగ్రహం, మంగళవారం 4, ఆగస్టు 2015

శ్రీమన్మథనామ సంవత్సరం
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
నిజ ఆషాఢ మాసం, తిథి బ.చవితి ఉ.7.58 వరకు
తదుపరి పంచమి తె.5.28 వరకు, (తెల్లవారితే బుధవారం),
నక్షత్రం ఉత్తరాభాద్ర తె.4.00 వరకు
(తెల్లవారితే బుధవారం), వర్జ్యం ప.2.30 నుంచి 4.00వరకు,
దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.06 వరకు,
తదుపరి రా.10.56 నుంచి 11.46 వరకు
అమృతఘడియలు రా.11.25 నుంచి 12.54 వరకు
సూర్యోదయం    : 5.42
సూర్యాస్తమయం:     6.28
రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు

భవిష్యం
 
మేషం
: కొత్త ఉద్యోగ యత్నాలు మందగిస్తాయి. పనులలో జాప్యం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యయ ప్రయాసలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు నెలకొంటాయి.

 వృషభం: ఇంటా బయటా అనుకూలం. ఆస్తిలాభం. ఉద్యోగ, విద్యావకాశాలు. సోదరుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు,ఉద్యోగాలలో ప్రోత్సాహం.

 మిథునం: మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు రాగలదు. నిరుద్యోగులకు అనుకూల సమాచారం. విందు వినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.

కర్కాటకం: శ్రమ తప్పదు. పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. సోద రులు, మిత్రులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.

సింహం: దూరప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇంటా బయటా ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. వ్యవహారాలలో ఆటంకాలు కలగవచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కన్య: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. విందువినోదాలు. కార్య జయం కలుగుతుంది. ఆస్తి విషయంలో ఒప్పందాలు. ఉద్యోగ లాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల: సోదరులు, సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి.శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు అభివృద్ధిబాటలో సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

వృశ్చికం: దూరప్రయాణాలు చేస్తారు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. బంధువులతో అకారణంగా విభేదాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

ధనుస్సు: మిత్రులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.

 మకరం: బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఇంటాబయటా అనుకూల వాతావరణం నెలకొంటుంది. కొత్త విద్యావకాశాలు. భూ, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి.

కుంభం: పనులు నత్తనడకన సాగుతాయి. దూరప్రయాణాలు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

 మీనం: అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తు, వస్త్ర లాభాలు. ఆహ్వానాలు రాగలవు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
 - సింహంభట్ల సుబ్బారావు
 
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement