ప్రపంచం నలుమూలలా మీ ప్రసంగాలతో ప్రవాస భారతీయులకు ఎంతో ప్రగాఢ విశ్వాసాన్ని ప్రసాదిస్తున్నారు.
ప్రపంచం నలుమూలలా మీ ప్రసంగాలతో ప్రవాస భారతీయులకు ఎంతో ప్రగాఢ విశ్వాసాన్ని ప్రసాదిస్తున్నారు. ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణ శంకుస్థాపనకి విచ్చేయు వేళ మా ఆంధ్రులకూ కాస్త నమ్మకమి వ్వండి. రాష్ట్రానికి.. కరువు మబ్బులు కమ్ముకొస్తున్నాయి. అప్పుల బరువు లతో భుజాలు కుంగిపోతున్నాయి. పరువూ ప్రతిష్టలకు పోయి ప్రభుత్వం వృథా ఖర్చుల్ని తలకెత్తుకొంటుంది. ప్రజలకు బతుకు తెరువు కష్టసాధ్యం కాగా, విభజన నష్టాలు తీరే మార్గం కానరాక.. తెలుగుతల్లి గుండె చెరువ వుతుంది. మీరు గతంలో మాటిచ్చారు. అన్ని విధాలా ఆంధ్రుల్ని ఆదు కొంటానంటూ. మాకు నమ్మకముంది. కానీ మీ అనుచరులే వివిధ భాష్యాలు చెప్పి మాటలతో ఆడుకొంటున్నారు.
ప్రత్యేక హోదా సంజీవ ని కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా అది అత్య వసర పరిస్థితిలో ఆర్థిక బలాన్ని పరిపుష్టం చేసే సంవర్ధిని. కాదంటారా! మొహమాటంతో సీఎం, విధేయతకు భంగమని మీ ప్రతినిధులు మీతో గట్టిగా చెప్పలేదేమో కానీ ఇది ప్రజల ఏకాభిప్రాయం. ప్రతి పక్షాలదే కాదు ప్రతీ ఒక్కరి ఆవేదన. అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాన్ని అన్ని విధాలా కేంద్రం ఆదుకోవాలి. విభజన హామీలన్నీ నెరవేర్చడమే కాక మరింతగా అవసరాలకనుగుణంగా స్నేహ హస్తం చాపాలి. ఆ కలని, మా ఆకలిని అన్నింటినీ గుర్తిస్తూ, కాస్త నమ్మకమిస్తారు కదూ! అభినందనలతో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం.
- డా॥మాజీ ఎంపీ, పార్వతీపురం,
విజయనగరం జిల్లా. మొబైల్ : 9440836931