కల నిజమైంది.. కన్ను మూసుకుంది | freedom fighter.. santhapuri raghuveer rao | Sakshi
Sakshi News home page

కల నిజమైంది.. కన్ను మూసుకుంది

Feb 8 2015 3:43 AM | Updated on Sep 2 2017 8:57 PM

కల నిజమైంది.. కన్ను మూసుకుంది

కల నిజమైంది.. కన్ను మూసుకుంది

సంతపురి రఘువీర రావు హైదరాబాద్ సంస్థా న స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభ వించి, తన కాలం సమర యోధులు చాలా మంది వలె అనేక విధాలుగా నష్ట పోయిన దేశభక్తుడు.

సంతపురి రఘువీర రావు హైదరాబాద్ సంస్థా న స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభ వించి, తన కాలం సమర యోధులు చాలా మంది వలె అనేక విధాలుగా నష్ట పోయిన దేశభక్తుడు. ఉన్న త చదువులు చదవలేక పోవటమే కాదు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే అవకా శమూ లేకపోయింది. నాయకత్వ లక్షణాలు ఉండి నాయకుడు కాలేకపోయారు. కొన్ని నియోజక వర్గాలలో ఓటర్లు మత విశ్వాసాల ఆధారంగానే ఓట్లు వేస్తారనీ, తగినంత ధనం లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుపు సాధ్యం కాదనీ తెలిసి ప్రజలలో ఎప్పటికైనా చైతన్యం రాకపోతుందా అనే విశ్వా సంతో హైదరాబాద్ నగరంలోని యాకుత్‌పురా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పదో పరకో కష్టార్జితం ఉంటే అది నష్టపోయారు. హైదరాబాద్ నగరంలో  కాలినడకన మొత్తం నియో జకవర్గం తిరిగి ప్రచారం చేసుకొన్న అభ్యర్థి బహుశా ఆయన ఒక్కరేనేమో! ప్రచారం చేసుకొంటున్న రోజు లలో సైతం పగలంతా తిరిగి అలసిపోయినప్పటికీ తాను ఉద్యోగం చేస్తున్న ఆంధ్రభూమి దినపత్రికలో సెలవు పెడితే జీతం నష్టం అవుతుందని రాత్రివేళ డ్యూటీ చేసేవారు. ఎన్నికల సమయంలో సైతం ఎవరినీ ధనసహాయం అడిగేవారు కాదు.

 1969 ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన జర్నలిస్టు ముఖ్యులలో రఘువీరరావు గారొకరు. చాలా మంది విద్యార్థి నాయకులు రాత్రి తొమ్మిది గంటల వేళ దక్కన్ క్రానికల్-ఆంధ్రభూమి కార్యాలయం వద్దకు వచ్చేవారు. అప్పుడే సంపాదక సిబ్బందికి విశ్రాంతి సమయం. విద్యార్థి నాయకులు, ఇతర ఉద్యమ పెద్దలు కూడా వచ్చి ప్రతాప్‌కిశోర్, రఘువీరరావు, పి.ఎన్.స్వామి గార్లతో మాట్లాడి వెళుతుండేవారు. క్రానికల్ కార్యాలయం పక్కనే ఉన్న ఒక టీ హోటల్ సమావేశ స్థలం. ఆ సంభాషణలలో మరునాడు ‘తెలంగాణ బంద్’ జరగాలనే నిర్ణయం జరిగితే, అది ఆంధ్రభూమి మొదటి పేజీలో వచ్చేది. మొత్తం తెలంగాణ బంద్ పాటించేది. ఈ పరిణామాల క్రమంలోనే తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించే ఒక వేదిక అవసరమనే నిర్ణయం జరిగింది. ఫలితంగా తెలంగాణ ప్రజాసమితి ఆవిర్భవించింది.
రఘువీరరావుగారు ఆంధ్రభూమి, ఈనాడు, ఆంధ్రప్రభ దినపత్రికలలో పనిచేశారు. కొంతకాలం భగవాన్ సత్యసాయి సన్నిధిలో, ‘సనాతన సారథి’ పత్రిక నడిపారు. 1970 ప్రాంతంలో అని జ్ఞాపకం. రఘువీరరావు సిఫారసుపై నలుగురు జర్నలిస్టులకు బాబా ‘ఇంటర్వ్యూ’ ఇచ్చారు. అప్పుడు బాబా గారిని కలుసుకొన్నవాళ్లం: డి.సీతారామ్, జి.రామా రావు, బి.నాగేశ్వరరావు, నేను. ప్రథమ కళత్రం పోయి, ఆయన తిరిగి వివాహం చేసుకొని, సంతా నం కలిగిన తరువాత ఉద్యోగం లేక కొన్నాళ్లు చాలా ఇబ్బందులు పడ్డారు. 1985-89 మధ్య కాలంలో శాసనసభ స్పీకర్‌గా ఉన్న జి. నారాయణరావు ఆయ నను సభ అనువాదకుడుగా నియమించారు. ఉర్దూ రాని సభ్యులకు తెలుగులో, తెలుగురాని సభ్యులకు ఉర్దూలో అనువాదం చేసి చెప్పటం ఆయన విధి. ఉర్దూ మాధ్యమంలోనే చదివారు కాబట్టి అత్యంత సమర్థంగా ఆ పని చేశారు.

రఘువీరరావుగారు ప్రజారంగంలో పనిచేస్తూ తను కోరుకున్నట్టు ప్రజాప్రాతినిధ్యం లభించి ఉండకపోవచ్చు. ఐతే ఆయనకు నెరవేరిన ఒకే ఒక కోరిక ఉంది. అది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవత రణ. ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటం చూసి చచ్చిపోవాలనుంది’ అని ఆయన అనేకసార్లు అన్నా రు. ప్రత్యేక రాష్ట్రం కోరినవారైనప్పటికీ ఆయన జాతీ యవాది. దేశ ప్రయోజనాల తరువాతే మరేదైనా అనేవారు. రఘువీరరావుగారు తెలంగాణ వచ్చినం దువల్ల అనుభవించిన మేలేమీ లేదు కాని, రాష్ట్రం ఏర్పడటమే ఆయనకు మహదానందం కలిగిం చింది. రఘువీరరావుగారు బతికుండగా ఆయనకు ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందన్న అసంతృప్తి ఆయన మిత్రులమైన చాలామందిలో ఉంది. కనీసం ఇప్పుడు నిరాధారంగా ఉన్న ఆయన కుటుంబానికి ప్రభుత్వం ఏదైనా సాయం చేయవచ్చు. 1969లో జైలుశిక్షలు అనుభవించి ఇప్పుడు ఆర్థికంగా కష్టా లలో ఉన్న జర్నలిస్టులకూ, ఇతరులకూ పింఛను సౌకర్యం ఏర్పాటు చేయవచ్చు. వేల కోట్ల రూపా యలు ఖర్చయ్యే పథకాలను ప్రకటిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఇదేమంత పెద్ద భారం కాదు. ‘మాట లు కాదు, మాది చేతల ప్రభుత్వం ’అని నాయకులు అప్పుడప్పుడు చేసే ప్రకటనలు ఒకింత ఆశాభావం కలిగిస్తున్నాయి.

పొత్తూరి వెంకటేశ్వరరావు, (వ్యాసకర్త మాజీ పత్రికా సంపాదకుడు), మొబైల్: 98481 40095
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement