ఉద్యోగం వెతుక్కోవడానికి తాత్కాలిక వీసా.. | UAE offers Temporary 6 Months Visa | Sakshi
Sakshi News home page

ఉద్యోగం వెతుక్కోవడానికి తాత్కాలిక వీసా..

Feb 9 2019 9:55 AM | Updated on Feb 9 2019 9:57 AM

UAE offers Temporary 6 Months Visa - Sakshi

విదేశాలలో విద్యాభ్యాసం పూర్తిచేసుకున్న విద్యార్థులు తగిన ఉద్యోగం వెతుక్కోవడానికి వీలుగా ఆయా దేశాలు స్వల్పకాలిక ‘జాబ్‌ సీకర్‌ వీసా’ ఇచ్చినట్లుగానే యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఎఇ) దేశం ఇటీవల ముగిసిన ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) పథకంలో ఆరు నెలల గడువుగల తాత్కాలిక వీసాలు ఇచ్చింది. అక్రమ వలసదారులు ఎలాంటి జరిమానా, జైలుశిక్ష లేకుండా తమ దేశాలకు వెళ్లిపోవడానికి వీలుగా యూఏఈ ప్రభుత్వం ఆగస్టు 1నుంచి డిసెంబర్‌ 31 వరకు ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఆమ్నెస్టీ పథకంలో దరఖాస్తు చేసుకున్న ప్రతిభావంతులకు, వృత్తి నిపుణులకు తాత్కాలిక వీసా అవకాశం కల్పించింది. ఆరు నెలల గడువులో కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి. లేనిపక్షంలో స్వదేశం వెళ్లిపోవాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement