డాలస్‌లో టీపాడ్‌ ఆధ్వర్యంలో వనభోజనాలు | TPAD Vanabhojanalu At Dallas | Sakshi
Sakshi News home page

డాలస్‌లో టీపాడ్‌ ఆధ్వర్యంలో వనభోజనాలు

Jun 21 2019 10:06 PM | Updated on Jun 21 2019 10:10 PM

TPAD Vanabhojanalu At Dallas - Sakshi

డాలస్ : డాలస్‌ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్) ఆధ్వర్యంలో జూన్‌ 15వ తేదీన వనభోజన కార్యక్రమం నిర్వహించారు. వృక్షసంపదతో విలసిల్లే ‘పైలట్ నాల్ పార్కు’  ఆర్గయిల్‌లో ఈ వేడుక జరిగింది. 'టీపాడ్ వనభోజనాల' కార్యక్రమాన్ని టీపాడ్ ప్రెసిడెంట్ చంద్రారెడ్డి పోలీస్, టీపాడ్ ప్రెసిడెంట్, ఫౌండేషన్ కమిటీ చైర్ జానకి రామ్ మందాడి, బోర్ద్ ఆఫ్ ట్రస్టీ చైర్ పవన్ గంగాధర, జాయింట్ సెక్రటరీ లక్ష్మి పోరెడ్డి, ట్రెసరర్ అనురాధ మేకల, సెక్రెటరి మాధవి లొకిరెడ్డి సహాయముతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిల్ల పెద్దలతో పాటు రెండువేల మందికి పైగా డాలస్‌ వాసులు హాజరయ్యారు. శశి రెడ్డి కర్రి, మధుమతి వ్యాసరాజు స్వాగతము పలకరింపు పలుకలతో, ఫొటో షూట్ అలంకరణలతొ పరిసరాలను అందంగా తీర్చిదిద్దారు. తొలుత గణేశుడికి టీపాడ్‌ సభ్యులు, డాలస్ వాసులు కలిసి పూజ నిర్వహించారు. అనంతరం 'ఫాదర్స్ డే' సందర్బంగా టీపాడ్ సంస్థ తండ్రులందరికి ‘కేక్ కట్టింగ్’  జరిపి అభినందనలను తెలియచేసింది. వనభోజనాల కార్యక్రమంలో ఏర్పాటు చేసిన 'ఫ్లాష్ మాబ్'లో కార్యవర్గ బృందంతో పాటు అక్కడికి వచ్చిన యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వప్న తుమ్మపాల.. చిన్నారులకి పరుగు పందెం, స్పూన్ విత్ లెమన్, గాలి పటాలు వంటి పోటీలను  నిర్వహించారు. ఈపోటీల్లో గెలుపొందినవారికి టీపాడ్ సంస్థ బహూమతులను ప్రదానం గావించింది.

ఈ కార్యక్రమానికి టీపాడ్ సంస్థ కార్యవర్గ బృందం అందరూ కలిసి పచ్చటి చెట్ల  క్రింద కావాల్సిన గ్యాస్ స్టవ్ లు, వంట సామగ్రి,  ఆహార వస్తువులు  అన్ని సమకుర్చారు. సుధాకర్ కలసాని, కరణ్ పోరెడ్డి, రత్నఉప్పాల, రఘు వూత్కూరి, శ్రీనివాస్ అన్నమనేని, చిరంజీవి మేఘాంశ్ రెడ్ది, చిరంజీవి నివేద్ రెడ్డి వేడి వేడి బార్బిక్యూ చికెన్, వేడిగా కాల్చిన మొక్కజొన్న పొత్తులని వనభోజనాలకు వచ్చిన వారందరికి అప్పటికప్పుడే చేసి ఇచ్చారు. ఉమ బండారు పర్యవేక్షనలో జయ తెలకలపల్లి, ఇంద్రాణి పంచార్పుల, మంజుల తొడుపునూరి, ఫణి, శ్రీనివాస్ వేముల,లింగారెడ్డి అల్వా, శంకర్ పరిమళ్, శారద సింగిరెడ్డి ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన  కార్యక్రమంలో ఉప్మా, టీ, కాఫీలు అందజేశారు. ఆ తర్వాత  మటన్ బిర్యాని, భగార అన్నం, వైట్ రైస్, ఆకుకూర పప్పు, పచ్చిపులుసు, ఆలు టమాట కుర్మా, కోడి కూర, టమాటా పచ్చడి, పైనాపిల్ రవ్వ కేసరి తీపి పదార్థము, పెరుగుతో రైతా, క్యారెట్స్-కీర, నిమ్మకాయ సలాడ్  మొదలగు రుచికరమైన కమ్మని  వంటలు చేసి ప్రేమానురాగాలతో వొచ్చిన వారందరికి మధ్యాహ్నం భోజనములో వడ్డించారు. 

తర్వాత సాయంత్రం చల్లని మజ్జిగ, చల్లని వాటర్ మెలన్ ముక్కలను, ఐస్‌క్రీమ్‌లు, వేడి వేడిగా టీ , కాఫీలను అందజేశారు. రూపకన్నయ్య గిరి, రోజా అడెపు, అపర్ణ కొల్లూరి, శరత్ పున్ రెడ్డి, గాయత్రి గిరి, రేణుక చనుమోలు , కళ్యాణి తాడిమెట్టి, వేణు భాగ్యనగర్, సునిత రెడ్డి, సుధీర్, దీపిక మరియు శ్రీలత వడ్డించడము, కూరగయలు కత్తిరంచడము మొదలగు పనులు మిగతా కార్యవర్గ బృందం తో కలిసి చక్కగా చేసారు. టీపాడ్ ఫౌండేషన్ కమిటీ, అజయ్ రెడ్డి, రావు కలవల, మహేందర్ కామిరెడ్డి, రాజ వర్ధన్  గొంది, ఉపేందర్ తెలుగు, బోర్డు అఫ్ ట్రస్టీ కో చైర్ మాధవి సుంకిరెడ్డి, బోర్డు అఫ్ ట్రస్టీ బుచ్చి రెడ్డి గోలి, రవికాంత్ రెడ్డి మామిడి వైస్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ కమిటీ దీప్తి సూర్యదేవర, శరత్ ఎర్రం, అడ్వైజరి కమిటీ సభ్యులు  విక్ర,మ్ జంగం, విజయ్ రెడ్డి,న రేష్ సుంకిరెడ్డి, సతీష్ నాగిళ్ల , కొలాబరేషన్  కమిటీ వంశీ కృష్ణ, స్రవణ్ నిడిగంటి, మాధవి మెంట, లావణ్య యరకాల ఆధ్వర్యములో కార్యక్రమము విజయవంతగా జరిపించారు.

ఫౌండేషన్ కమిటీ రఘువీర్ బండారు విలువైన సలహాలు, సూచనలతో కార్యక్రమం రూపుదిద్దుకొని వనభోజనాల కార్యక్రమం సంతోషంగా కొనసాగి విజయవంతమైంది. పాస్ట్ బోర్ద్ ఆఫ్ ట్రస్టీస్ రాం అన్నాడి, అశోక్ కొండల ఈవెంట్ కి సంబంధించిన లాజిస్టిక్స్ సమకూర్చె విషయములో కీలక పాత్రను పొషించారు. ప్రతి సంవత్సరం పచ్చటి వాతావరణములో 'టీపాడ్ వనభోజనాలు' కార్యక్రమం నిర్వహించడం ద్వారా తెలుగు వారికే కాకుండా భారత దేశం నలుమూలల నుండి వచ్చే వారి మధ్య చక్కటి అనుబంధాలకు తోడ్పడుతోంది. కార్యక్రమం చివరిగా టీపాడ్ ప్రెసిడెంట్ చంద్రా రెడ్డి పోలీస్, బోర్డు ఆప్ ట్రస్టీ చైర్ పవన్ గంగాధర, వనభోజనాల కార్యక్రమ సమన్వయ కర్తలు లక్ష్మి పోరెడ్డి, అనురాధ మేకల సంయుక్తంగా, పనిచేసిన కార్యకర్తలందరికి, స్థానిక మరియు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులకు, పత్రిక మరియు ప్రసార మాధ్యమాలకు, వనభోజనాలు నిర్వహించటానికి కావాల్సిన ప్రాంగణ వసతులు కల్పించిన పైలట్ నాల్ పార్క యాజమాన్యానికి, దాతలకు, సహాయ పడిన ‘ఫార్మ్ టు కుక్’ యాజమాన్యానికి కృతఙ్ఞతా పూర్వక అభినంనములు తెలియజేశారు.

1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement