ఆన్‌లైన్‌లో ఉచితక్లాసులు అందిస్తున్న యప్‌ టీవీ

Yupp TV Introduces Free Online Classes for Students - Sakshi

సాక్షి, ఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా భారత ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్‌ విధించక ముందే పలు రాష్ట్రాలు  పాఠశాలలకు సెలవులు ప్రకటించి, పరీక్షలను వాయిదా వేశాయి. తరువాత కరోనా విజృంభణ మరింత ఉధృతం కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ మూడు వారాల పాటు ఏప్రిల్‌ 14 వరకు లాక్‌డౌన్‌ విధించారు. దీంతో సీబీయస్‌ఈతో సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పదవ తరగతి మినహా మిగిలిన విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్‌ చేశాయి. ఇక కరోనా కేసులు నానాటికి పెరిగిపోవడంతో ఏప్రిల్‌ 14న లాక్‌డౌన్‌ ఎత్తివేస్తారో లేదో అనే సందిగ్థల నెలకొంది. తెలంగాణతో పాటు కొన్ని రాష్టరాలు లాక్‌డౌన్‌ను కొనసాగించాలని లేకపోతే పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని కేంద్రానికి సూచిస్తున్నాయి. (లాక్ డౌన్ పొడిగింపుపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు)

ఈ నేపథ్యంలోనే ఐఐటీ/జే ఈ ఈ, నీట్ విద్యార్థులకు యప్ టీవీ ఉచిత ఆన్ లైన్ కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. ఉత్తమ అధ్యాపకులు, ప్రపంచ స్థాయి స్ట్రీమింగ్ టెక్నాలజీ , లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో పోటీ పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావడానికి ఉపయోగపడే విధంగా ఈ కోర్సులను డిజైన్‌ చేశారు. యప్ మాస్టర్  ద్వారా ప్రతిరోజూ ఆరు గంటల లైవ్ క్లాసులు, ఇంటరాక్షన్ కు అవకాశం లభిస్తుందని   యప్ టీవీ సీఈఓ ఉదయ్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు www.yuppmaster.comకు లాగిన్ అయి ఉచితంగా పాఠాలు వినొచ్చు అన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇళ్లకే పరిమితమైన విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 14,32,577 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 82,195 మంది చనిపోయారు. భారత్‌ విషయానికి వస్తే 5,194 కరోనా కేసులు నమోదు కాగా, 149 మంది మరణించారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో  బుధవారం ఉదయం నాటికి  కరోనా బాధితుల సంఖ్య 329కు చేరింది.  కరోనా భారిన పడి ఇప్పటి వరకు నలుగురు మృతి చెందగా, ఆరుగురు డిశ్చార్జ్‌ అయ్యారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top