రైల్వేలకు పెద్దపీట వేసి.. సామాన్యుడికి చవకైన ప్రయాణం అందుబాటులోకి తేవాలని వైఎస్సార్ కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
పార్లమెంటులో వైఎస్సార్‌సీపీ ఎంపీలు మేకపాటి, మిథున్‌రెడ్డి సూచన
సాక్షి, న్యూఢిల్లీ: వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో జాతీయ రహదారులకు పెద్దపీట వేసిన రీతిలో ఇప్పుడు రైల్వేలకు పెద్దపీట వేసి.. సామాన్యుడికి చవకైన ప్రయాణం అందుబాటులోకి తేవాలని వైఎస్సార్ కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌పై చర్చలో వైఎస్సార్ సీపీ ఎంపీలు మేకపాటి, పి.వి. మిథున్ రెడ్డి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ. 20,680 కోట్ల అంచనాలు గల 29 ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని త్వరితగతిన పూర్తిచేయాలని వారు రైల్వేమంత్రిని కోరారు.