బంక్‌ల భారీ దగా.. తక్కువే పోస్తున్నారు | You might be getting 1015% less fuel | Sakshi
Sakshi News home page

బంక్‌ల భారీ దగా.. తక్కువే పోస్తున్నారు

Apr 30 2017 9:40 AM | Updated on Sep 5 2017 10:04 AM

బంక్‌ల భారీ దగా.. తక్కువే పోస్తున్నారు

బంక్‌ల భారీ దగా.. తక్కువే పోస్తున్నారు

పెట్రోల్‌ బంక్‌ల విషయంలో అనుమానం కలిగి ఉండటం తప్పులేదని మరోసారి రుజువైంది. ఇప్పటి వరకు కల్తీకి మాత్రమే పాల్పడే అవకాశం ఉందని బంక్‌లపై ఆరోపణలు ఉన్నప్పటికీ చెల్లించిన దానికంటే తక్కువ పెట్రోల్‌, డీజిల్‌ పోస్తున్నారని తాజాగా స్పష్టమైంది.

న్యూఢిల్లీ: పెట్రోల్‌ బంక్‌ల విషయంలో అనుమానం కలిగి ఉండటం తప్పులేదని మరోసారి రుజువైంది. ఇప్పటి వరకు కల్తీకి మాత్రమే పాల్పడే అవకాశం ఉందని బంక్‌లపై ఆరోపణలు ఉన్నప్పటికీ చెల్లించిన దానికంటే తక్కువ పెట్రోల్‌, డీజిల్‌ పోస్తున్నారని తాజాగా స్పష్టమైంది. ఉత్తరప్రదేశ్‌లో దీనికి సంబంధించి పెద్ద రాకెట్టు గుట్టు వీడింది. వినియోగదారుడు చెల్లించే ధరకు పోయాల్సిన పెట్రోల్‌, డీజిల్‌ కన్నా 10 నుంచి 15శాతం తక్కువ పోస్తున్నారు. ఓ వ్యక్తి నుంచి సమాచారం అందుకున్న స్పెషల్‌ టాస్క్‌ పోలీసులు వివిధ పెట్రోల్‌ బంకుల్లో తనిఖీలు చేయగా ఈ గుట్టు రట్టయింది.

నకిలీ పెట్రోల్‌ పంపులను ఉపయోగించి గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం కొనసాగిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. ఇలా ఏడాదికి ప్రతి సంవత్సరం దాదాపు రూ.250 కోట్లు వెనుకేసుకుంటున్నారని తేల్చేశారు. దేశంలో కనీసం నిబంధనలు పాటించకుండా కస్టమర్లను మోసం చేసే డీలర్లు ఓ పదిశాతంమంది ఉన్నట్లు ఇప్పటికే ఓ అంచనా ఉంది. ఆయిల్‌ మంత్రిత్వశాఖ వద్ద ఉన్న సమాచారం ప్రకారం ప్రతి ఏడాది రూ.2,500కోట్ల విలువైన పెట్రోల్‌, డీజిల్‌ను 59,595 పెట్రోల్‌ బంకుల్లో యూపీ ప్రజలు కొనుగోలు చేస్తున్నారట.

అయితే, ప్రజలను చాలామంది రిటెయిలర్లు దారుణంగా మోసం చేస్తున్నారని తెలుసుకున్న ప్రత్యేక టాస్క్‌ పోర్స్‌ బృందం అప్పటికప్పుడు శుక్రవారం ఏడు పెట్రోల్‌ బంక్‌లపై ఏకకాలంలో దాడులు నిర్వహించగా నకిలీ పంపులను ఉపయోగించి వినియోగదారులను మోసం చేస్తున్నట్లు తెలిసింది. రవీందర్‌ అనే వ్యక్తి దీనిని ప్రధానంగా నడిపిస్తున్నట్లు తెలుసుకున్నారు. అతడు ఉత్తరప్రదేశ్‌లోని దాదాపు 1000 పెట్రోల్‌ బంకుల్లో నకిలీ పంపులను పెట్టి నడిపిస్తున్నట్లు గుర్తించారు. దీంతో మరింత అప్రమత్తమైన టాస్క్‌ఫోర్స్‌ ప్రత్యేక టీంను సిద్ధం చేసి ఇప్పుడు తనిఖీలు చేయిస్తోంది. ఈ సందర్భంగా ఆయిల్‌ మంత్రి ధర్మేంద్ర ప్రధాన అభినందనలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement