యోగా కోసం పాట! | Yog Geet Released by Ayush Minister Shri Shripad Yesso Naik | Sakshi
Sakshi News home page

యోగా కోసం పాట!

Jun 17 2016 8:07 PM | Updated on May 29 2019 2:58 PM

ప్రపంచ యోగా దినోత్సవం-2016 సందర్భంగా యోగ్ గీత్ పేరుతో పాటను ఆయుష్ మినిష్టర్ శ్రీపాద్ నాయక్ శుక్రవారం న్యూఢిల్లీలో విడుదల చేశారు

ప్రపంచ యోగా దినోత్సవం-2016 సందర్భంగా యోగ్ గీత్ పేరుతో పాటను ఆయుష్ మినిష్టర్ శ్రీపాద్ నాయక్ శుక్రవారం న్యూఢిల్లీలో విడుదల చేశారు. మూడు నిమిషాల పదిహేను సెకండ్ల నిడివి కలిగిన ఈ గీతం హిందీ భాషలో ఉంది. ధీరజ్ సారస్వత్, గంగాధర్, టీ.డీ జాదవ్, గత జాదవ్ లు ఈ పాటను రాసి ఆలపించారు. సుమంత్ రే పాటకు సంగీతాన్ని సమకూర్చారు. యోగ్ గీత్ పాట కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ వచ్చిన 19 గీతాల నుంచి దీనిని ఎంపిక చేసింది. గత ఏడాది నుంచి జూన్ 21వ తేదీని ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement